Singareni | కాంట్రాక్ట్ కార్మికులకు తీపికబురు.. రూ.30లక్షల ప్రమాద బీమా వర్తింపజేయనున్నట్లు సింగరేణి..!
Singareni | కాంట్రాక్ట్ ఉద్యోగులకు సింగరేణి శుభవార్త చెప్పింది. కంపెనీలో పని చేస్తున్న దాదాపు 25వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రూ.30లక్షల ప్రమాద బీమా సదుపాయం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.
Singareni | కాంట్రాక్ట్ ఉద్యోగులకు సింగరేణి శుభవార్త చెప్పింది. కంపెనీలో పని చేస్తున్న దాదాపు 25వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రూ.30లక్షల ప్రమాద బీమా సదుపాయం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ సాలరీ అకౌంట్ ఉన్న ప్రతి కాంటాక్టర్ ఉద్యోగికి బీమా అమలవుతుందని చైర్మన్, ఎండీ బలరామ్ ప్రకటించారు. సింగరేణి భవన్లో ఆయన ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమంపై సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాద బీమా సదుపాయం వర్తింపజేసేందుకు ప్రతీ కాంట్రాక్ట్ ఉద్యోగి హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో సాలరీ అకౌంట్ ఉండాలన్నారు. ఈ విషయంలో ఏరియా జీఎంలు సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఇప్పటికే సింగరేణి ఉద్యోగుల కోసం ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ల ద్వారా రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని సీఎం, ఉప ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించామన్నారు. అలాగే కాంట్రాక్టు కార్మికుల సంక్షేమం కోసం హెచ్డీఎఫ్సీతోనూ ఒప్పందం చేసుకుని రూ.30లక్షల ప్రమాద బీమా వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రూ.50లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయాన్ని కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తింపజేసేందుకు సైతం ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబ సభ్యుల సామాజిక, ఆర్థిక భద్రత చర్యల్లో భాగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందిస్తున్నామని.. వారి కుటుంబ సభ్యులకు, పిల్లలకు కూడా ఆరోగ్య సేవలు అందించే విషయంపై ఈఎస్ఐ ఆసుపత్రుల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిపారు.
కొత్తగూడెం, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (NTPC)లలో ఈఎస్ఐ ఆసుపత్రుల ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్మిక చట్టాలు, కోర్టు దిశా నిర్దేశం ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులందరికీ తప్పనిసరిగా పీఎఫ్, సీఎంపీఎఫ్, పింఛన్ కోసం జీతంలో కొంత రికవరీ చేసి.. కాంట్రాక్టర్ల ద్వారా అంతే మొత్తాన్ని కలిపి వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందన్నారు. జీతాలు, పీఎఫ్, సీఎంపీఎఫ్ చెల్లింపులు సకాలంలో సంక్రమంగా జరిగేందుకు వీలుగా వారికి సంబంధించిన మస్టర్లను కూడా వెబ్ అప్లికేషన్ ద్వారా నమోదు చేసే ప్రక్రియను చేపడుతున్నట్లు ఆయన వివరించారు. వచ్చే నెల మొదటివారం నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

