Para Powerlifting World Cup : అంతర్జాతీయంగా పలు క్రీడల్లో సత్తా చాటుతున్న భారత్.. పారా పవర్ లిఫ్టింగ్ వరల్డ్ కప్ (Para Powerlifting World Cup 2025)లోనూ పతకాల వేటకు సిద్ధమైంది. చైనాలోని బీజింగ్ వేదికగా జరుగబోయే ఈ టోర్నీకి 16 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది భారత పవర్ లిఫ్టింగ్ కమిటీ. ఈ మధ్యే నేషనల్ ఛాంపియన్‌షిప్స్‌లో మెరిసిన జైనాబ్ ఖాటున్, సీమా రాణి (Seema Rani), ఝండు కుమార్, జాబి మథ్యూ, మనీష్ కుమార్, కస్తూరిలకు స్క్వాడ్‌లో చోటు దక్కింది.
పారా పవర్ లిఫ్టింగ్ వరల్డ్ కప్ పోటీలకు ఎంపికైన 16 మందిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. .. జూన్ 17 నుంచి 25 వరకూ జరుగనున్న ఈ టోర్నీ కోసం భారత స్క్వాడ్ ఆదివారం చైనా బయల్దేరింది. అంతకంటే ముందు ఈ బృందానికి అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
A strong 16-member Indian🇮🇳 para #Powerlifting team received a warm send-off at NSCI, New Delhi ahead of the Beijing 2025 World Cup, scheduled to take place from June 17 – 25 in the presence of notable dignitaries who extended their best wishes.
All the best, #TeamIndia🇮🇳👍🏻… pic.twitter.com/iYx7Sx1iCX
— SAI Media (@Media_SAI) June 15, 2025
‘అంతర్జాతీయంగా జరిగే ప్రతి పారా పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో భారత్ తన శక్తిని చాటుతోంది. మన క్రీడాకారులు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. చైనా ఆతిథ్యమిస్తున్న పవర్ లిఫ్టింగ్ వరల్డ్ కప్‌లో ఆశించిన ఫలితాలు వస్తాయనే నమ్మకం నాకుంది. మరో ముఖ్యమైన విషయం 16 మందిలో ఏకంగా ఏడుగురు మహిళలే. భవిష్యత్‌లో పారా క్రీడల పురోగతికి ఇదొక శుభ సంకేతం’ అని భారత పారా పవర్ లిఫ్టింగ్ ఛైర్మన్ జేపీ సింగ్ తెలిపారు.
భారత పారా బృందానికి ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారాలింపిక్ కమిటీ మాజీ అధ్యక్షురాలు దీపా మాలిక్, ప్రస్తుతం పారాలింపిక్ కమిటీ సెక్రటరీ జనరల్ జయవంత్ హమన్నవర్, తదితరులు పాల్గొన్నారు.