Taekwondo | నిజాబాబాద్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు
నిజామాబాద్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి మీర్ వాహజ్ అలీ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
- అధ్యక్ష కార్యదర్శులుగా అజ్మత్ ఖాన్, వినోద్
Taekwondo | కంటేశ్వర్ జూన్ 15 : నిజామాబాద్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి మీర్ వాహజ్ అలీ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ తమ సంఘానికి గుర్తింపునిచ్చిందని, నిజామాబాద్ జిల్లా నుంచి గత ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది క్రీడాకారులను టైక్వాండో క్రీడారంగంలో ప్రోత్సహిస్తూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. అదే స్ఫూర్తితో రాబోవు రోజుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దాలని నూతన కార్యవర్గాన్ని సూచించారు. టైక్వాండో క్రీడారంగాభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలను నిజామాబాద్ జిల్లా అసోసియేషన్ కు ఎల్లవేళలా అందిస్తామన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్గా ఫుట్బాల్ కోచ్ జి. నాగరాజు , ఒలంపిక్ అసోసియేషన్ అబ్జర్వర్ గా అబ్దుల్ ఉమర్ వ్యవహరించగా టైక్వాండో అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గంలో చైర్మన్ గా డాక్టర్ రమేష్ పవర్, అధ్యక్షునిగా మహమ్మద్ అజ్మత్ ఖాన్, ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్, కోశాధికారిగా వినోద్, ఉపాధ్యక్షులుగా వాగ్మా రే సుభాష్, శ్యామ్, మంజునాథ్, వినోద్ రెడ్డి, రాము, సంయుక్త కార్యదర్శులుగా ప్రశాంత్ కుమార్, బుచ్చన్న, మురళి, వినోద్, ప్రవీణ్, సంతోష్ లను నూతన కార్యవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నెట్ బాల్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

