Asian Championships : అండర్ 17 వరల్డ్ ఛాంపియన్ మన్సీ లాథర్ (Mansi Lather) మరోసారి పంజా విసిరింది. జూనియర్ ఆసియా ఛాంపియన్షిప్స్ ట్రయల్స్‌లో ప్రత్యర్థిని అలవోకగా మట్టికరిపించింది. ఈ ఏడాది మార్చిలో సీనియర్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలుపొందిన ఈ రెజ్లర్.. 68 కిలోల విభాగంలో ఢిల్లీకి చెందిన శ్రిష్ఠి (Shrishti)ని ఓడించింది. తద్వారా కిర్గిస్థాన్ (Kyrgyzstan)లో జరుగబోయే అండర్ 20 ఆసియా ఛాంపియన్షిప్స్ బెర్తు ఖరారు చేసుకుంది మన్సీ. జూలై 5 నుంచి 13 వరకూ జరగబోయే ఈ మెగా టోర్నీకి ముక్సాన్ నందల్ 57 కిలోల విభాగంలో అర్హత సాధించింది.
కిర్గిస్థాన్ వేదికగా జూలై తొలివారంలో జరుగనున్న అండర్ – 20 ఆసియా ఛాంపియన్షిప్స్ పోటీలకు క్వాలిఫై అయిన భారత మహిళా రెజ్లర్ల వివరాలివి. శ్రుతి(50 కిలోలు), సారిక(53 కిలోలు), రీనా(55 కిలోలు), నేహర్ శర్మ(57 కిలోలు), అంజలి(62 కిలోలు), హర్షిత(72 కిలోలు), కాజల్(76 కిలోలు).
🇮🇳🥇🇮🇳🥇🇮🇳🥇🇮🇳🥇
43kg – Aditi KUMARI
57kg – NEHA
65kg – PULKIT
73kg – Mansi LATHERIndian wins four golds at U17 Worlds#Wrestling #wrestleamman pic.twitter.com/X4gYecmXdC
— United World Wrestling (@wrestling) August 23, 2024
ఈ పోటీల కోసం జూన్ 14న లక్నోలో పురుష రెజ్లర్లకు ట్రయల్స్ నిర్వహించారు. ఫ్రీ స్టయిల్, గ్రీకో రోమన్ విభాగంలో ఆసియా ఛాంపియన్షిప్స్ బెర్తు సాధించిన వాళ్లు ఎవరంటే… అంకుశ్ (57 కిలోలు), అనుజ్(61 కిలోలు), అశ్వనీ(65 కిలోలు), సౌరభ్(70 కిలోలు), వివేక్(74 కిలోలు), అమిత్(79 కిలోలు), సచిన్ (86 కిలోలు), సచిన్(92 కిలోలు), విశాల్(97 కిలోలు), జశ్పూరన్(125 కిలోలు),
గ్రీకో రోమన్ : నితిన్(55 కిలోలు), సూరజ్(60 కిలోలు), వరుణ్(63 కిలోలు), యోగేశ్(67 కిలోలు), ఆకాశ్ పూనియా(72 కిలోలు), సచిన్ (77 కిలోలు), ప్రిన్స్(82 కిలోలు), రోహిత్(87 కిలోలు), నమన్ (97 కిలోలు), జోగిందర్ రథీ(130 కిలోలు)