Ramagundam | గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ నాయకులు, సింగరేణి ప్రాంత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రామగుండంకు విచ్చేసిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి, ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి అనంతరం ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
ముందుగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల వృద్ధుల సంక్షేమ ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖ మంత్రిగా రామగుండం నియోజకవర్గం కి రావడం సంతోషకరంగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో రామగుండం నియోజకవర్గం ప్రత్యేక స్థానం దక్కించుకోవాలని, స్థానిక నాయకుల నిబంధన ప్రజల సహకారం ద్వారా మన ప్రాంతం అభివృద్ధి సాధ్యమవుతుందని, మన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సందర్భంగా మన ప్రాధాన్యతకు నిదర్శనం అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని మౌలిక వసతులు మెరుగుదల యువతకు ఉపాధి అవకాశాలు విద్యా ఆరోగ్యారంగంలో సరైన ప్రాణాలిక అమలుతో మేము ముందుకు పోతాము ముఖ్యమంత్రి మార్గ దర్శనంలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు, అంతర్గాం, పాలకుర్తి మండలాల సీనియర్ నాయకులు పాల్గొన్నారు.