Paris Olympics : భారత స్టార్ డబుల్స్ జోడీకి ప్యారిస్ ఒలింపిక్స్‌లో లక్కీ డ్రా లభించింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ (Satwik Sairaj), చిరాగ్ శెట్టీ (Chirag Shetty) ద్వయం తేలికైన ప్రత్యర్థుల గ్రూప్‌లో నిలిచింది. దాంతో, ఇండియా జంట మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరడం ఖాయమై పోయింది. తొలి పోరులో ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్, ముహమ్మద్ రియాన్ అర్డియంటో జంటతో సాత్విక్ – చిరాగ్ జోడీ తలపడనుంది.
ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల డబుల్స్‌లో 17 జోడీలు బరిలోకి దిగుతున్నాయి. దాంతో, ఒక దాంట్లో నాలుగు చొప్పున మూడు గ్రూపులుగా విభజించారు. నాలుగో గ్రూప్‌లో మాత్రం ఐదు జోడీలు ఉన్నాయి. సాత్విక్ – చిరాగ్‌లు గ్రూప్ సిలో ఉండగా.. గ్రూప్ డిలో వరల్డ్ నంబర్ 2 కిమ్ అస్ట్రుప్, అండెర్స్ రసమ్ముస్సెన్ (డెన్మార్క్) ద్వయంతో పాటు ఏడో సీడ్ టకురో హొకి, యుగో కొబయశి (జపాన్)లతో పాటు చైనా, చైనీస్ తైపీ జోడీలు ఉన్నాయి.
The men’s doubles groups for #Paris2024.#Olympics #badminton | @Paris2024 @Olympics pic.twitter.com/6EmZNSo6h4
— BWF (@bwfmedia) July 15, 2024
ఇప్పటికే మహిళల, పురుషలు సింగిల్స్ డ్రాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu), హెచ్ఎస్ ప్రణయ్ (HS Prannoy)లకు గ్రూప్ దశలో తేలికైన ప్రత్యర్థులు ఎదురుకానున్నారు. గ్రూప్ ఎమ్లోని క్రిస్టిన్ కుబా (ఈస్టోనియా), పాకిస్థాన్‌కు చెందిన నబాహ్ అబ్దుల్ రజాక్‌లతో సింధు తలపడనుంది. ఇక 16వ రౌండ్లో సింధుకు చైనాకు చెందిన హీ బింగ్ జియావోను ఢీకొట్టనుంది.

పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌కు సులువైన డ్రా లభించింది. గ్రూప్ కెలోని లీ డుయో ఫాట్ (వియత్నాం), ఫాబియన్ రొత్(జర్మనీ)లతో ప్రణయ్ ఎదురుపడనున్నాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ యంగ్‌స్టర్ సులువుగా 16వ రౌండ్‌కు చేరే చాన్స్ ఉంది. ఇక మరో భారత షట్లర్ లక్ష్యసేన్‌కు కఠినమైన డ్రా దొరికింది. మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీతో అతడికి గట్టి పోటీ ఎదురవ్వనుంది. జూలై 26వ తేదీన ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.