Woman Calls Off Wedding | ఎయిర్ కూలర్ వద్ద కూర్చోవడం కోసం ఘర్షణ.. పెళ్లి రద్దు చేసిన వధువు
Woman Calls Off Wedding | ఎయిర్ కూలర్ వద్ద కూర్చోవడంపై వధూవరుల బంధువులు కోట్లాటకు దిగారు. ఘర్షణ మరింత ముదరడంతో ఏకంగా పెళ్లిని వధువు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో వరుడు, వధువు తండ్రితో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
లక్నో: ఎయిర్ కూలర్ వద్ద కూర్చోవడంపై వధూవరుల బంధువులు కోట్లాటకు దిగారు. దీంతో వరుడి బంధువుల ప్రవర్తనను వధువు నిలదీసింది. ఘర్షణ మరింత ముదరడంతో ఏకంగా పెళ్లిని రద్దు చేసింది. (Woman Calls Off Wedding) ఈ నేపథ్యంలో వరుడు, వధువు తండ్రితో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చిత్బరగావ్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక పెళ్లి జరుగుతోంది. అయితే ఎయిర్ కూలర్ ముందున్న కుర్చీలపై కూర్చోవడంపై వరుడి కుటుంబ సభ్యులు, వధువు బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రం కావడంతో ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు.
కాగా, వరుడు బంధువుల ప్రవర్తనను పెళ్లికూతురు నిలదీసింది. దీంతో వివాదం కాస్త మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన వధువు పెళ్లి క్యాన్సిల్ చేసింది. పెళ్లి కొనసాగింపును నిరాకరించింది. ఇరు కుటుంబాలు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ పెళ్లి రద్దు నిర్ణయాన్ని ఆమె మార్చుకోలేదు.
మరోవైపు గ్రామంలోని పంచాయతీ వద్దకు ఈ వివాదం చేరింది. చర్చల్లో ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వరుడు హుకుమ్ చంద్ జైస్వాల్, అతడి బంధువు పంకజ్, వధువు తండ్రి నంద్ జీ గుప్తా, ఆమె సోదరుడు రాజేష్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే వధువు పెళ్లి రద్దు చేయడంపై ముస్తఫాబాద్‌కు చెందిన వరుడు హుకుమ్‌చంద్ జైస్వాల్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లి తంతు ముగుస్తుండగా కూలర్ వద్ద కూర్చోవడంపై తమ కుటుంబ సభ్యులు, వధువు బంధువుల మధ్య గొడవ జరిగినట్లు చెప్పాడు. పెళ్లిని రద్దు చేసుకోవద్దని వధువును తాను వేడుకున్నట్లు తెలిపాడు. పెళ్లిలో చిన్న గొడవలు జరుగుతాయని చెప్పి ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించాడు. అయినప్పటికీ పూర్తి కావస్తున్న పెళ్లి కొనసాగడాన్ని వధువు నిరాకరించిందని అన్నాడు. ఇరువురి బంధువుల కోట్లాటలో తన ప్రమేయం ఏమీ లేకపోయినా పర్యవసానాలను తాను భరించాల్సి వచ్చిందని వాపోయాడు.
बलिया : कूलर हवा खाने को लेकर बराती-घराती भिड़े
➡दुल्हन को जानकारी होने पर शादी से किया इंकार
➡मनाता रहा दूल्हा पर दुल्हन ने शादी से किया इनकार
➡मौके पर पहुंची पुलिस ने दोनों पक्षों को समझाया
➡नहीं बनी बात बिना दुल्हन के बगैर लौटी बारात
➡चितबडागांव थाने के नगर पंचायत का… pic.twitter.com/h9elKwtzlq— भारत समाचार | Bharat Samachar (@bstvlive) July 13, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Air cooler
- Ballia
- Calls off
- fight
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

