Sky diving : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి (Union Tourism Minister) గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) పెద్ద సాహసమే చేశారు. ప్రపంచ స్కై డైవింగ్ డే (World Sky diving Day) ను పురస్కరించుకుని శనివారం గగనతలంలో వేగంగా వెళ్తున్న విమానంలో నుంచి ఆయన పారాచూట్‌తో కిందకు దూకారు.
అయితే ఒక నిపుణుడి సాయంతో ఆయన ఈ సాహసోపేతమైన ఫీట్లో పాల్గొన్నారు. విమానం నుంచి వారు దూకిన కొద్ది క్షణాలకు పారాచ్యూట్ తెరుచుకుంది. ఆ తర్వాత మేఘాల మీద తేలియాడుతూ వారు భూమి మీదకు చేరుకున్నారు. లేటు వయసులో కేంద్ర మంత్రి చేసిన ఈ సాహసాన్ని కింది వీడియోలో మీరే స్వయంగా చూడండి..
#WATCH | Narnaul, Haryana: Union Tourism Minister Gajendra Singh Shekhawat does skydiving on World Skydiving Day.
(Source: Sky High India) pic.twitter.com/KrLGeE5UdY
— ANI (@ANI) July 13, 2024