Watch: వర్షం నీటితో నిండిన రోడ్డు.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్లిన సిబ్బంది, వీడియో వైరల్
Medical College Principal Taken Out On A Stretcher | వర్షం నీటితో రోడ్డు నిండిపోయింది. దీంతో ఆ నీటిలో నడిచి వెళ్తే దుస్తులు తడుస్తాయని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ భావించారు. ఈ నేపథ్యంలో సిబ్బంది స్ట్రెచర్‌పై ఆయనను బయటకు తీసుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: వర్షం నీటితో రోడ్డు నిండిపోయింది. దీంతో ఆ నీటిలో నడిచి వెళ్తే దుస్తులు తడుస్తాయని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ భావించారు. ఈ నేపథ్యంలో సిబ్బంది స్ట్రెచర్‌పై ఆయనను బయటకు తీసుకెళ్లారు. (Medical College Principal Taken Out On A Stretcher) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో షాజహాన్‌పూర్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి కూడా నీట మునిగింది. ఈ నేపథ్యంలో తన కారు వద్దకు నీటిలో నడిచి వెళ్లేందుకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేష్ కుమార్ సంశయించారు. దుస్తులు నీటిలో తడవకుండా ఉండేందుకు స్ట్రెచర్‌పై బయటకు వెళ్లారు. ఒక స్ట్రెచర్‌పై ఆయన కూర్చోగా సిబ్బంది దానిని లాక్కెళ్లారు. రాజేష్ కుమార్ బ్యాగ్, ఇత్తర వస్తువులను కూడా మరో స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కర్చీఫ్‌తో తన ముఖాన్ని దాచుకునేందుకు ఆయన ప్రయత్నించారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేష్ కుమార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ విమర్శలను ఆయన ఖండించారు. తన చర్యను సమర్థించుకున్నారు. షాజహాన్‌పూర్‌ను వరదలు ముంచెత్తడంతో మెడికల్ కాలేజీ కూడా జలమయమైందని తెలిపారు. సుమారు 300 మంది రోగులు, సిబ్బంది, ఇతరులు ఇక్కడ చిక్కుకున్నారని చెప్పారు.
మరోవైపు అంబులెన్స్‌లు, బస్సుల ద్వారా రోగులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్లు రాజేష్ కుమార్ తెలిపారు. ‘నీరు భయంకరంగా పెరిగింది. అంబులెన్స్ ద్వారా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించా. నా కాలికి గాయం ఉంది. మధుమేహం కూడా ఉంది. దాని కారణంగా నేను నడవలేకపోతున్నా. నా వద్ద పని చేసే సిబ్బందితో మాట్లాడా. స్ట్రెచర్‌పై తీసుకెళ్తామని వారు చెప్పారు. మెడికల్ కాలేజీ నుంచి స్ట్రెచర్‌పై బయటకు వచ్చా’ అని అన్నారు.
पेंट गीली न हो जाए, इसलिए मेडिकल कॉलेज के प्रिंसिपल स्ट्रेचर पर बैठकर निकले। स्ट्रेचर खींचने के लिए 4 कर्मचारी लगे हुए थे।
📍जिला शाहजहांपुर, उत्तर प्रदेश pic.twitter.com/yNz25N80og— Sachin Gupta (@Sachingupta) July 13, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

