Paris Olympics 2024 : భారత ఏస్ డబుల్స్ జోడీ విశ్వ క్రీడలను విజయంతో ఆరంభించింది. ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj) – చిరాగ్ శెట్టి(Chirag Shetty) ద్వయం పారిస్ ఒలింపిక్స్‌లో బోణీ కొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ జంట ల్యూకస్ కొర్వీ, రొనన్ లాబర్‌పై గెలుపొందింది. 47 నిమిషాల పాటు మోరాహోరీగా సాగిన పోరులో భారత ద్వయం ప్రత్యర్థికి ఏమాత్రం చాన్స్ ఇవ్వలేదు.
తొలి సెట్‌ను 21-17తో గెలుపొందిన సాత్విక్ – చిరాగ్ రెండో సెట్లోనూ దూకుడుగా ఆడారు. దాంతో, 21-14తో వెనకబడిన ఫ్రాన్స్ జంటకు ఓటమి తప్పలేదు. ఈ విజయంతో సీత్విక్, చిరాగ్ జంట రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.
SatChi announce their arrival at #Paris2024 with a brilliant win over home-favourites 😎🔥
📸: @badmintonphoto#Paris2024#IndiaAtParis24#Cheer4Bharat#IndiaontheRise#Badminton pic.twitter.com/MDSQEAqRW7
— BAI Media (@BAI_Media) July 27, 2024
పురుషుల సింగిల్స్‌లోనూ భారత షట్లర్ లక్ష్యసేన్(Lakshya Sen) సత్తా చాటాడు. అద్బుత విజయంతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో కెవిన్ కార్డాన్ (Kevin Cordon)పై లక్ష్యసేన్ అలవోకగా గెలుపొందాడు. తొలి సెట్‌ను 21-8తో సొంతం చేసుకున్న భారత షట్లర్‌కు రెండో సెట్లో గట్టి పోటీనిచ్చాడు. అయితే.. ఏమాత్రం పట్టువిడవని లక్ష్యసేన్ 22-20తో సెట్‌ను ముగించి కెవిన్‌కు చెక్ పెట్టాడు.
Olympic debut with a SENsational win for Lakshya 🥳👏
Keep it up champ!
📸: @badmintonphoto#Paris2024#IndiaAtParis24#Cheer4Bharat#IndiaontheRise#Badminton pic.twitter.com/GL51c4gnjn
— BAI Media (@BAI_Media) July 27, 2024