Satwik – Chirag : భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj ) – చిరాగ్ శెట్టి (Chirag Shetty) కొత్త ఏడాదిలోనూ జోరు చూపిస్తోంది. నిరుడు ఆసియా క్రీడ(Asian Games 2023)ల్లో పసిడి కాంతులు విరజిమ్మిన ఈ ద్వయం తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ (French Open) టైటిల్ నెగ్గింది. చైనీస్ తైపీకి చెందిన లీ ఝే యూ, యాంగ్ పొ సువాన్ జంటపై ఫైనల్లో అద్భుత విజయంతో రెండో సూపర్ 750 టైటిల్ ఖాతాలో వేసుకున్నారు.
మ్యాచ్ ముగియగానే ఆనందం పట్టలేకపోయిన సాత్విక్.. చిరాగ్‌ను అమాంతం ఎత్తుకున్నాడు. అంతేనా.. ఇద్దరూ కలిసి తమ విజయాన్ని కోర్టులోనే చిందేశారు. తమదైన స్టెప్పులతో విజయాన్ని ఆస్వాదించారు. రాకెట్‌ను గిరగిరా తిప్పుతూ.. శరీరాన్ని ముందుకూ, వెనక్కీ కదిలిస్తూ సాత్విక్ అదిరిపోయే డాన్స్ చేశాడు. కాసేపు ఒంటికాలిపై స్పెప్స్ వేసి ప్రేక్షకులను అలరించాడు. ఇంతకూ ఆ స్పెషల్ డాన్స్ సెలబ్రేషన్ ఎప్పుడు మొదలైందో తెలుసా..?
Special win calls for special dance moves ft. @satwiksairaj 🥳🕺#FrenchOpen2024#IndiaontheRise#Badminton pic.twitter.com/GJl1hBPY8i
— BAI Media (@BAI_Media) March 10, 2024
‘థామస్ కప్ నుంచి మా ఈ డాన్స్ సెలబ్రేషన్ మొదలైంది. అప్పటినుంచి ఇదొక అలవాటుగా మారింది. అయితే.. మేము ఈ డాన్స్ చేసి చాలా రోజులైంది. నాలుగో ఫైనల్ తర్వాత మా స్పెషల్ డాన్స్ చేశాం’ అని సాత్విక్ వెల్లడించాడు. వరల్డ్ నంబర్ 1 గా ఫ్రెంచ్ ఓపెన్‌లో అడుగుపెట్టిన సాత్విక్ – చిరాగ్ జోడీ తొలి రౌండ్ నుంచి దుమ్మురేపింది. టైటిల్ పోరులోనూ అదే జోరు చూపిస్తూ లీ ఝే, యాంగ్ జంటను 21-11, 21-17తో చిత్తు చేసింది.
✅ #FrenchOpen2024 Champions
✅ World No. 1️⃣ rankSo proud of you boys! 👑
📸: @badmintonphoto#IndiaontheRise#Badminton pic.twitter.com/tumMAW1VK3
— BAI Media (@BAI_Media) March 10, 2024
దాంతో, చైనీస్ తైపీ జోడీపై తమ రికార్డును 3-0కు పెంచుకుంది. నిరుడు సూపర్ ఫామ్‌తో వరుస టైటిళ్లు సాధించిన సాత్విక్ -చిరాగ్ జంట 2019లో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అప్పుడు చేజారిన ట్రోఫీని ఈ స్టార్ ద్వయం 2022లో ముద్దాడింది. మళ్లీ ఇప్పుడు తమ సంచలన ఆటతో బలమైన ప్రత్యర్థులను చిత్తు చేస్తూ.. రెండోసారి విజేతగా అవతరించింది.