Sarfaraz Khan : రంజీల్లో టన్నుల కొద్దీ పరుగులు.. పదుల సంఖ్యలో సెంచరీలు… ఇవేవీ ఇవ్వని సంతృప్తి దేశం తరఫున సెంచరీతో వస్తుంది. ఇప్పుడు రంజీ వీరుడు సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) అదే సంతోషంలో ఉన్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెలరేగిన సర్ఫరాజ్ సెంచరీ కలను నిజం చేసుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న సర్ఫరాజ్ తొలి టెస్టులో విజయంపై నమ్మకంగా ఉన్నాడు. బెంగళూరు పిచ్ మీద పర్యాటక జట్టు విజయం అంత తేలిక కాదని సర్ఫరాజ్ అంటున్నాడు.
‘దేశం తరఫున తొలి సెంచరీ కొట్టినందుకు సంతోషంగా ఉంది. అయితే.. రేపు పరిరస్థితులు కఠినంగా ఉండే అవకాశం ఉంది. పిచ్ మీద ఇప్పటికే పగుళ్లు కనిపిస్తున్నాయి. బంతి అనుకున్నదానికంటే ఎక్కువ టర్న్ అవుతోంది. మేము ఆదిలో వికెట్లు తీయగలిగితే న్యూజిలాండ్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. రెండో రోజు మేము తడబడ్డట్టే వాళ్లు కూడా చేతులెత్తేస్తారు’ అని మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్ తెలిపాడు.
Lighting up your feed with the moment of the day 🤗
Describe Sarfaraz Khan’s maiden century with an emoji 💯#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/YzmhAcisgY
— BCCI (@BCCI) October 19, 2024
భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఉత్కంఠగా సాగుతున్న తొలి టెస్టులో సర్ఫరాజ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో ఇరగదీస్తూ శతకంతో గర్జించాడు. 195 బంతుల్లో 150 రన్స్ కొట్టి ఔటైన సర్ఫరాజ్ టీమిండియా ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. రిషభ్ పంత్(99)తో కలిసి నాలుగో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
🎥 WATCH
Maiden Test Ton: Super Sarfaraz Khan’s scintillating 150(195) 👌👌#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) October 19, 2024
అయితే.. టీ సెషన్ ముందు పంత్‌ను ఔట్ చేసిన విలియం ఓరూర్కీ(99/3) భారత్‌ను దెబ్బతీశాడు. మ్యాట్ హెన్రీ(109/3) సైతం మూడు వికెట్లతో చెలరేగగా భారత్ 462 పరుగులకే ఆలౌట్ అయింది. ఓటమి తప్పించుకోవాలంటే టీమిండియా బౌలర్లు 10 వికెట్లు తీయాలి. దాంతో, ఐదో రోజు తొలి సెషన్ ఇరుజట్లకు కీలకం కానుంది. స్వదేశంలో 18వ టెస్టు సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన భారత జట్టును ఇప్పుడు ఆదుకోవాల్సింది బుమ్రా, జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లతో కూడిన స్పిన్ త్రయమే.