అమరావతి : ఏపీలోని నంద్యాల జిల్లాలో శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు ప్రాజెక్టులోని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక(Karnataka) నుంచి వస్తున్న వరదతో శ్రీశైలానికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో నాలుగు గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ (Nagarjunasagar) డ్యాంకు నీటిని విడుదల చేస్తున్నారు.
గత మూడు రోజులుగా వస్తున్న వరద ప్రవాహంతో మొదటగా ఒక గేటును ఎత్తిన అధికారులు ప్రవాహం పెరగడంతో శనివారం మరో మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరో వైపు పులిచింతల ప్రాజెక్టుకు లక్షా 18 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా లక్షా 36 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.