Duleep Trophy : ఫామ్ లేమితో భారత సీనియర్ జట్టులోకి వస్తూ పోతున్న సంజూ శాంసన్(Sanju Samson) ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎట్టకేలకు జూలు విదిల్చాడు. దులీప్ ట్రోఫీ (Duleep Trophy)లో డకౌట్లో నిరాశపరిచిన సంజూ రెండో రౌండ్లో దుమ్మురేపాడు. ‘ఇండియా డీ’ తరఫున అతడు శతకంతో గర్జించాడు. ఇండియా బీ బౌలర్లను ఉతికేసిన శాంసన్ ఐదేండ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మూడంకెల స్కోర్ సాధించాడు. 2019లో బెంగాల్ మీద తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన సంజూ 116 రన్స్ కొట్టాడు.
ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో శాంసన్ పెద్దగా రాణించింది లేదు. అలాంటిది ఇప్పుడు దులీప్ ట్రోఫీలో తన మార్క్ ఇన్నింగ్స్ ఆడి ఇండియా డీకి భారీ స్కోర్ అందించాడు. శాంసన్‌తో పాటు ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్(50), శ్రీకర్ భరత్(52)లు కూడా దంచడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా డీ 349 పరుగులు చేసింది.
అభిమన్యు ఈశ్వరన్(103 నాటౌట్)
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇండియా బీ దీటుగా బదులిస్తోంది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(103 నాటౌట్) మరోసారి సెంచరీతో చెలరేగాడు. ఓవైపు సహచరులు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా అభిమన్యు ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్(34 నాటౌట్)తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మిస్తున్నాడు. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా బీ 161 పరుగులు వెనకబడి ఉంది.