ఒట్టావా, సెప్టెంబర్ 19: విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లను తగ్గించనున్నట్టు కెనడాప్రకటించింది. ‘ఈ ఏడాది 35 శాతం తక్కువగా అంతర్జాతీయ స్టడీ పర్మిట్లను మంజూరు చేస్తున్నాం. వచ్చే ఏడాది ఈ సంఖ్య మరో 10 శాతం తగ్గనుంది. వలస మా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమే. కానీ కొందరు ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసి విద్యార్థుల ప్రయోజనాన్ని పొందినప్పుడు దాన్ని కట్టడిచేస్తాం’ అని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో బుధవారం స్పష్టంచేశారు.
తాత్కాలిక నివాసితుల సంఖ్యను తగ్గించాలని కెనడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది. భారత విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్యాభ్యాసానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లను తగ్గించాలన్న ఆ దేశ నిర్ణయం చాలా మంది భారత విద్యార్థులపై ప్రభావం చూపనుంది.