Luxury space balloon | లగ్జరీ బార్, రక్లైనర్ సీట్లు, లౌడ్ మ్యూజిక్.. ఇలా విలాసవంతమైన సౌకర్యాలతో స్పేస్ బెలూన్, క్యాప్సూల్‌ను తయారు చేసింది అమెరికాకు చెందిన ‘స్పేస్ పెర్స్పెక్టీవ్’ అనే అంతరిక్ష పర్యాటక సంస్థ. ‘నెప్ట్యూన్’ పేరుతో తయారు చేసిన ఈ స్పేస్ బెలూన్ను ఫ్లోరిడా నుంచి విజయవంతంగా ప్రయోగించింది.ఇందులో ప్రయాణానికి 1,25,000 డాలర్లకు ఒక టికెట్ విక్రయిస్తున్నది. ఇప్పటికే 1800 టికెట్లు అమ్ముడయ్యాయి.