IND vs SA 3rd T20 : పొట్టి ఫార్మాట్లో వరుసగా రెండు సెంచరీతో రికార్డు సృష్టించిన సంజూ శాంసన్(0) మళ్లీ డకౌట్ అయ్యాడు. రెండో టీ20లో సున్నా చుట్టేసిన అతడు సెంచూరియన్ వేదికగా సాగుతున్న మూడో టీ20లోనూ 3 బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో, పరుగుల ఖాతా తెరవకముందే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
అయితే.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(26), అభిషేక్ శర్మ(37)లు మాత్రం సఫారీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దంచేస్తున్నారు. సఫారీ పేసర్లపై ఎదురుదాడికి దిగితూ బౌండరీల మోత మోగిస్తున్నారు. దాంతో, భారత జట్టు స్కోర్ పవర్ ప్లేలోనే 70 దాటేసింది.
Sanju Samson #sanjusamson pic.twitter.com/gTlUUCcdSN
— RVCJ Sports (@RVCJ_Sports) November 13, 2024
డర్బన్‌లో మెరుపు శతకం బాదిన ఓపెనర్ సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవర్లో డిఫెన్స్ ఆడబోయిన సంజూ బౌల్డ్ అయ్యాడు. అంతే.. భారత అభిమానుల్లో ఒకింత కలవరం. అయితే.. శాంసన్ ఔటైన వెంటనే వచ్చిన తిలక్ వర్మ(26) వరుసగా 4, సిక్సర్‌తో జాన్సెన్కు షాకిచ్చాడు. తిలక్ దూకుడు చూసిన అభిషేక్ శర్మ(37) సైతం బ్యాటుకు పని చెప్పగా భారత జట్టు స్కోర్ రాకెట్ వేగంతో పరుగులు తీసింది. పర్ ప్లే ముగిసేసరికి టీమిండియా వికెట్ కోల్పోయి 71 పరుగులు చేసింది.