IND vs RSA : సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ సంజూ శాంసన్(108 : 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత సెంచరీ బాదడంతో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. 8 ఏండ్లుగా మూడంకెల స్కోర్ కోసం నిరీక్షిస్తున్న శాంసన్ దక్షిణాఫ్రికా గడ్డపై తన కలను నిజం చేసుకోగా.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(52 : 77 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొని వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ బాదాడు. చివర్లో రింకూ సింగ్(38) వీరవిహారం చేయడంలో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. సఫారీ బౌలర్లలో హెండ్రిక్స్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు.
టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. అరంగేట్రం చేసిన ఓపెనర్ రజత్ పటిదార్ (22 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్), ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్(10 16 బంతుల్లో ఒక ఫోర్) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. దాంతో, టీమిండియా 10 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది.
Sanju Samson’s wonderfully paced ton and Rinku Singh’s powerful cameo gives India a strong total after being put in 💪
Who’s winning the decider? https://t.co/mDg07w2hl1 | #SAvIND pic.twitter.com/LkqBA7jZ50
— ESPNcricinfo (@ESPNcricinfo) December 21, 2023
కొద్దిసేపటికే కెప్టెన్ కేఎల్ రాహుల్(21) ను మల్డర్ పెవిలియన్ పంపాడు. దాంతో, భారత్ 101 వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆ దశలో భారత్ స్కోర్ 200 దాటడమే కష్టమనిపించింది. కానీ, బ్యాటింగ్‌కు సహకరించిన పిచ్‌పై శాంసన్, రింకూ మొండిగా పోరాడారు. నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 116 పరుగులు జోడించారు. మొదట్లో నిదానంగా ఆడిన ఈ ఇద్దరూ కుదరుకున్నాక ధాటిగా ఆడి జట్టు స్కోర్ 200 దాటించారు.
శాంసన్‌కు అనుభవానికి కొదవ లేదు. అతడు ఉన్నచోటనే నిలబడి భారీ సిక్సర్లు కొట్టగలడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ సారథిగా సక్సెస్ అయ్యాడు కూడా. అతడి కంటే వెనక వచ్చిన కుర్రాళ్లు జట్టులో పాతుకుపోతన్నారు. కానీ, సంజూకి మాత్రం అప్పుడప్పుడూ జాతీయ జట్టులోకి వస్తూ పోవడం మామూలైపోయింది. ఎందుకంటే..? దేశం తరఫున ఆడిన ప్రతిసారి ఒత్తిడికి లోనై అదీ కాదంటే చెత్త షాట్‌తో వికెట్ పారేసుకునేవాడు.
“This is gonna be a day he’ll remember for a long time.” 🇮🇳pic.twitter.com/Z6kV5vLHJH
— Rajasthan Royals (@rajasthanroyals) December 21, 2023
అందుకనే వరల్డ్ కప్ జట్టులోనూ ఈ పవర్ హిట్టర్‌కు చోటు దక్కలే. అయితే.. ఈసారి శాంసన్ ఏ పొరపాటు చేయలేదు. 59కే రెండు కీలక వికెట్లు పడిన వేళ క్రీజులోకి వచ్చిన శాంసన్ ఎంతో ఓపికగా నిలబడ్డాడు. హాఫ్ సెంచరీతో రిలాక్స్ కాకుండా జట్టుకు భారీ స్కోర్ అందిచాలని పట్టుదలతో ఆడాడు. సఫారీ బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్ ఇవ్వకుండా వన్డేల్లో సెంచరీ సాధించాడు. 2015లో వన్డే జట్టులోకి వచ్చిన శాంసన్ విలువైన ఇన్నింగ్స్ ఆడి తనలో పస తగ్గలేదని, వన్డేలకు తాను సరిపోతానని నిరూపించాడు.