IND vs SA 4th T20 : సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోసిన భారత కుర్రాళ్లు మళ్లీ విజృంభించారు. సిరీస్ విజేతను నిర్ణయించే నాలుగో టీ20లో పంజా విసిరారు. గత మ్యాచ్ సెంచరీ హీరో తిలక్ వర్మ(120 నాటౌట్), ఓపెనర్ సంజూ శాంసన్(109 నాటౌట్)లు ఆకాశమే హద్దుగా ఆడారు. ఈ ఇద్దరూ దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపించేశారు.
శాంసన్, తిలక్ వర్మల విధ్వంసంతో సఫారీ ఫీల్డర్లు చేష్టలుడిగిపోగా టీమిండియా వరుసగా రెండో మ్యాచ్‌లో రెండొందలపైనే కొట్టింది. ఈ ఇద్దరూ సెంచరీలతో గర్జించగా సూర్యకుమార్ సేన సఫారీలపై రికార్డు స్కోర్ బాదింది. గత మ్యాచ్‌లో 220 పరుగుల ఛేదనలో చివరిదాకా పోరాడి ఓడిన మర్క్రమ్ బృందం ఈ కొండంత లక్ష్యాన్ని కరిగించడం కష్టమే.
🔥 The highest total in all men’s T20s in South Africa
🔥 India’s second-highest T20I total ever🔗 https://t.co/WQCWljqsgi | #SAvIND pic.twitter.com/K5CIJVYUNp
— ESPNcricinfo (@ESPNcricinfo) November 15, 2024
జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో భారత టాపార్డర్ బ్యాటర్లు శివాలెత్తిపోయారు. ఆడుతున్నది భారత పిచ్‌ల మీదే అన్నట్టు బౌండరీల మీద బౌండరీలు బాదేశారు. డేంజరస్ ఓపెనర్ సంజూ శాంసన్ (109 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. యువకెరటం తిలక్ వర్మ(120 నాటౌట్) భీకర ఫామ్ కొనసాగించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ(36) జట్టు స్కోర్ 73 పరుగుల వద్ద ఔట్ అయ్యాక.. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ ఎడాపెడా బౌండరీలతో అలరించాడు. అటువైపు శాంసన్ సైతం తగ్గకపోవడంతో 9 ఓవర్లకే భారత జట్టు స్కోర్ 100 దాటింది. ఆకాసేపటికే స్టబ్స్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన శాంసన్ యాభై పూర్తి చేసుకున్నాడు.
9⃣ 🤝 7⃣2⃣
Sanju Samson 🤝 Tilak Varma
📸 📸 In Frame: The ONLY two Indians to score 2⃣ successive T20I 💯s 👏 👏
Live ▶️ https://t.co/b22K7t8KwL#TeamIndia | #SAvIND pic.twitter.com/aPeVqRUfCn
— BCCI (@BCCI) November 15, 2024
సఫారీ స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్, పేసర్ గెరాల్డ్ కోయెట్జీలను లక్ష్యంగా చేసుకున్న తిలక్ కూడా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దాంతో, 14.1 ఓవర్‌కే టీమిండియా స్కోర్‌బోర్డు 200 దాటేసింది. 95 పరుగుల వద్ద జాన్సెన్ క్యాచ్ జారవిడువడంతో తిలక్ బతికిపోయాడు. అదే ఓవర్లో సింగిల్ తీసిన శాంసన్ అంతర్జాతీయ టీ20ల్లో మూడో సెంచరీ సాధించాడు.
అనంతరం సిపమ్లా వేసిన 19వ ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీసిన తిలక్ పొట్టి ఫార్మాట్లో వరుసగా రెండో శతకం నమోదు చేశాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన శాంసన్, తిలక్‌కు రెండో వికెట్‌కు అజేయంగా 210 రన్స్ జోడించారు. దాంతో, భారత్ నిర్ణీత ఓవర్లలో వికెట్ నష్టానికి 283 రన్స్ కొట్టేసింది.