KTR | సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగిచర్ల తండాల్లో గిరిజనులపై రాత్రికి రాత్రి రజాకర్ల తరహాలో పోలీసులు దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ బాధితురాలు ఆవేదనతో మాట్లాడిన వీడియోను ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేశారు.
కళ్లుండీ చూడలేని చెవులుండీ వినలేని బధిరాంధక రేవంత్ ప్రభుత్వపు దాష్టీకానికి మచ్చుతునక ఇది అని రేవంత్ రెడ్డి అన్నారు. రెక్కాడితేనే కానీ డొక్కాడని ఆ పేద గిరిజనుల భూముల మీద రేవంత్ కన్నేసిండు అని పేర్కొన్నారు. మా భూములు గుంజుకోవద్దన్నందుకు, పోలీసులే దొంగల్లెక్క అర్ధరాత్రి ఆ నిస్సహాయుల ఇళ్ల మీద పడ్డారని మండిపడ్డారు. గడ్డపారలతో వారి ఇండ్ల తలుపులు విరగ్గొట్టారని.. ఇంట్లో ఉన్న బీరువాను కూడా వదలకుండా పగలగొట్టారని.. కళ్లు సరిగ్గా కనిపించని ఈ ముసలమ్మ చేతి కర్రను లాగి విసిరేశారని.. దొరికినవాళ్లను దొరికినట్టు నిర్బంధించి చిత్రహింసలు పెట్టి, జైళ్లో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం పేరున గద్దెనెక్కి ప్రజా కంటకుడిగా మారిన రేవంత్ నిర్వాకమిది అని విమర్శించారు.
కళ్లుండీ చూడలేని
చెవులుండీ వినలేని
బధిరాంధక రేవంత్ ప్రభుత్వపు
దాష్టీకానికి మచ్చుతునక ఇది!రెక్కాడితేనే కానీ
డొక్కాడని ఆ పేద గిరిజనుల
భూముల మీద కన్నేసిండు రేవంత్.మా భూములు గుంజుకోవద్దన్నందుకు,
పోలీసులే దొంగల్లెక్క
అర్ధరాత్రి ఆ నిస్సహాయుల ఇళ్ల మీద పడ్డారు.గడ్డపారలతో వారి
ఇండ్ల… pic.twitter.com/fjjPap6aFE— KTR (@KTRBRS) November 15, 2024