Honda EV Activa | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) త్వరలో ఆవిష్కరించనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల చేసింది. స్విమ్ ఆర్మ్ మౌంటెడ్ యూనిట్‌గా కనిపిస్తుంది. అత్యధికంగా ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లు మిడ్ డ్రైవ్ పర్మినెంట్ మ్యాగ్నటిక్ సింక్రోనస్ (పీఎంఎస్) మోటార్ వాడతారు. పలు ఈ-స్కూటర్లలో బీఎల్డీసీ హబ్స్, స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ మోటార్లు వాడతారు.
బజాజ్ చేతక్ ఈవీ, హీరో మోటో కార్ప్ వారి విదా వీ1 వంటి స్కూటర్లలో స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ స్కూటర్లు ఉన్నాయి. బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్ దారిలోనే హోండా పయనిస్తోంది. హోండా యాక్టీవా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తెస్తున్నది. ఈవీ స్కూటర్ తయారీలో సంక్లిష్టతను, విద్యుత్ బదిలీ నష్టాన్ని స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ మోటార్ తగ్గించేస్తుంది. అందుకోసం బెల్ట్ డ్రైవ్ లేదా చైన్ డ్రైవ్ పీఎంఎస్ మోటార్ తో వస్తుందీ హోండా యాక్టీవా ఎలక్ట్రిక్ స్కూటర్. నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టీవాకు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ తోపాటు డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, నేవిగేషన్ తదితర ఫీచర్లు ఉంటాయి. వీటితోపాటు కనెక్టెడ్ టెక్ వయా ప్యాక్స్ అందిస్తోంది హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్.
కర్ణాటకలోని నర్సాపురాలో డెడికేటెడ్ ఈవీ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తామని గతేడాదే ప్రకటించింది హోండా మోటార్ సైకిల్స్. ఈ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌లో 2030 నాటికి పది లక్షల యూనిట్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. స్పాన్ స్వాపబుల్ బ్యాటరీ అండ్ ఫిక్స్డ్ బ్యాటరీ పవర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్లాట్ ఫామ్ పై ఎలక్ట్రిక్ యాక్టీవా రూపుదిద్దుకుంటున్నది. హోండా మోటార్ సైకిల్ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. హోండా మొబైల్ పవర్ ప్యాక్ ఈ ఆధ్వర్యంలో స్వాపబుల్ బ్యాటరీ ఆప్షన్‌తో మరిన్ని కమర్షియల్ అప్లికేషన్స్ సిద్ధం చేయాలని హోండా యోచిస్తు్న్నది.ఈ నెల 27న హోండా మోటార్ సైకిల్స్ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించడానికి రంగం సిద్ధం చేస్తున్నది. మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే హోండా ఎలక్ట్రిక్ యాక్టీవా ధర ఆకర్షణీయంగా ఉంటుందని భావిస్తున్నారు.