IPL Mega Auction : క్రీడాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 9 రోజుల్లో జెడ్డా (Jeddah) వేదికగా వేలం పాట షురూ కానుంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ఐపీఎల్ పాలకమండలి వేలం మూహూర్తం కూడా ఖరారు చేసింది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియాలు పెర్త్ టెస్టు(Perth Test)లో ఆడుతున్న సమయంలోనే వేలం ప్రక్రియ సాగనుంది.
శుక్రవారం సాయంత్ర ఐపీఎల్ యాజమాన్యం ఎక్స్ వేదికగా వేలం సమయాన్ని వెల్లడించింది. భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు పెర్త్ టెస్టు ప్రారంభం కానుండా.. నవంబర్ 24వ తేదీ మధ్నాహ్నం 3:30 గంటలకు జెడ్డాలో మెగా వేలం మొదలవ్వనుంది. రెండో రోజైన 25న కూడా అదే సమయానికి ఆక్షనీర్ కనీస ధరను బట్టి క్రికెటర్ల పేర్లను చదువనుంది.
🚨 NEWS 🚨
TATA IPL 2025 Player Auction List Announced!
All the Details 🔽 #TATAIPLhttps://t.co/QcyvCnE0JM
— IndianPremierLeague (@IPL) November 15, 2024
ఐపీఎల్ మెగా వేలంలో 1,574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ, చివరకు వడబోత అనంతరం 574 మంది మాత్రమే వేలం పాటలో నిలిచారు. వీళ్లలో 81 మంది ఆటగాళ్లు రూ.2 కోట్ల కనీస ధర పలుకుతున్నారు. మొత్తంగా 574 మంది క్రికెటర్లలో భారతీయులు 366 మంది (48 మంది అన్క్యాప్డ్తో కలిపి) ఉండడం విశేషం. ఇక విదేశీ ఆటగాళ్లు 208 మంది.. 193 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లతో పాటు అనుబంధ దేశాలకు చెందిన 12 మంది వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.