అమరజ్యోతి ప్రాంగణం, అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ సముదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గాలికొదిలేశారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులపై మీకున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.
తెలంగాణ అమరుల త్యాగాన్ని యావత్ సమాజం స్మరించుకునేలా కేసీఆర్ నిర్మించారని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భారతరత్న అంబేడ్కర్ ఆలోచన విధానాలను భావితరాలు కొనసాగించడానికి స్ఫూర్తి పొందేలా 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మిస్తే.. నిర్వీర్యం చేయడం మీకు తగునా అని ప్రశ్నించారు. రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి అంబేడ్కర్‌పై ఉన్న గౌరవం ఇదేనా అని నిలదీశారు.