IPL 2025 : చిన్నస్వామి మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాపార్డర్ కుప్పకూలింది. టర్నింగ్ పిచ్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్లు రెచ్చిపోవడంతో పెవిలియన్‌కు క్యూ కట్టారు. పవర్ ప్లేలో ధాటిగా ఆడిన ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(37) టాప్ స్కోరర్. పవిప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడిన రజత్ పటిదార్(25), విరాట్ కోహ్లీ(22)లు విఫలమయ్యారు. అయితే.. టిమ్ డెవిడ్(37 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో బెంగళూరును ఒడ్డున పడేశాడు. డెత్ ఓవర్లలో రెచ్చిపోయిన అతడు 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాది జట్టు స్కోర్ 160 దాటించాడు. డేవిడ్ అద్భుత హిట్టింగ్తో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ మంటూ ఉదేసిన ఢిల్లీని బెంగళూరు నిలువరిస్తుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
టాస్ ఓడిన బెంగళూరు ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలు పెట్టింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(37) తనదైన శైలిలో బౌండరీలతో ఢిల్లీ బౌలర్ల గుండెల్లో గుబులు రేపాడు. హడలెత్తించాడు. మిచెల్ స్టార్క్ వేసిన 3వ ఓవర్లో రెచ్చిపోయిన అతడు తొలి బంతిని సిక్సర్‌గా మలిచి ఆ తర్వాత 4, 4, 6, 4 బాది 30 పరుగులు రాబట్టాడు. అ తర్వాత అక్షర్ బౌలింగ్‌లో విరాట్ సిక్సర్ బాది స్కోర్ 60 దాటించాడు.
Innings Break!#DC put things under control with the ball, but Tim David’s late attack helps #RCB reach 163/7! 👏
Will DC chase this down and maintain their unbeaten run? 🤔
Updates ▶ https://t.co/h5Vb7sp2Z6#TATAIPL | #RCBvDC | @DelhiCapitals pic.twitter.com/5nO7Qsbipd
— IndianPremierLeague (@IPL) April 10, 2025
అయితే.. ఆ తర్వాత బంతికే సింగిల్ తీసే క్రమంలో సాల్ట్ కోహ్లీ నిరాకరించాడు. అభిషేక్ పొరెల్ విసిరిన బంతి అందుకున్న రాహుల్ వికెట్లను గిరాటేశాడు. దాంతో,61 వద్ద ఆర్సీబీ తొలి వికెట్ పడింది. ఆ కాసేపటికే ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్(1) ఔటయ్యాడు. ఆపద్భావంవుడిలా ఆదుకునే కోహ్లీ.. విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో సిక్సర్‌తో జోరు పెంచాడు. కానీ, అదే ఓవర్లో పెద్ద షాట్ ఆడబోయి మిచెల్ స్టార్క్‌కు దొరికాడు. అంతే.. అక్కడి నుంచి ఆర్సీబీ స్కోర్ వేగం తగ్గిపోయింది.
ఇక 10వ ఓవర్ తర్వాత బంతి టర్న్ కావడంతో కుల్దీప్ యాదవ్ రంగంలోకి దిగాడు. అతడి బౌలింగ్‌లో జితేశ్ శర్మ(4), కెప్టెన్ రజత్ పటిదార్(25)లు ఒకే తరహాలో ఔట్ కావడంతో ఆర్సీబీని మరింత కష్టాల్లో పడింది. 116 వద్దే ఆరు కీలక వికెట్లు పడడంతో ఒకదశలో ఆ జట్టు 130 కొట్టడమే గగనం అనిపించింది. అయితే.. టిమ్ డేవిడ్ (37 నాటౌట్: 20 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) క్రీజులోకి వచ్చాక సీన్ మారింది.
𝙁𝙞𝙧𝙨𝙩 𝙩𝙞𝙢𝙚 𝙬𝙖𝙨 𝙨𝙤 𝙣𝙞𝙘𝙚, 𝙝𝙚 𝙝𝙖𝙙 𝙩𝙤 𝙙𝙤 𝙞𝙩 𝙩𝙬𝙞𝙘𝙚 🪄
🎥 Kuldeep Yadav’s identical wickets that put #DC on 🔝 against #RCB 💙
Updates ▶ https://t.co/h5Vb7sp2Z6#TATAIPL | #RCBvDC | @DelhiCapitals | @imkuldeep18 pic.twitter.com/U4Dy73dXt7
— IndianPremierLeague (@IPL) April 10, 2025
అప్పటిదాకా జోష్‌లో ఉన్న ఢిల్లీ ఆటగాళ్లను కంగారు పెట్టిస్తూ.. అక్షర్ పటేల్ వేసిన 19వ ఓవర్లో సిక్సర్ బాది స్కోర్ 130 దాటించాడీ హిట్టర్. ఆ తర్వాత బంతిని కవర్ డ్రైవ్‌తో ఫోర్ వచ్చింది. నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచాడు. ముకేశ్ కుమార్ వేసిన 20వ ఓవర్లో.. రెండు సిక్సర్లు, ఫోర్ బాది జట్టకు పోరాడగలిగే స్కోర్ అందించాడు.