IND vs ZIM : తొలి టీ20లో అనూహ్యంగా ఓడిన భారత జట్టు (India) రెండో మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకోనుంది. విజయంతో సిరీస్ సమం చేయాలనుకుంటున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు.
మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్ యూనిట్ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీమిండయా కూర్పులో మార్పులు చేసింది. పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో ఐపీఎల్ హిట్టర్ సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చాడు. ఆతిథ్య జట్టు మాత్రం ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
🚨 Toss Update 🚨#TeamIndia elect to bat in the 2nd T20I.
One change in the Playing XI as Sai Sudharsan makes his T20I Debut 👏👏
Follow The Match ▶️ https://t.co/yO8XjNpOro#ZIMvIND pic.twitter.com/IRQUvxEd3O
— BCCI (@BCCI) July 7, 2024
భారత జట్టు : అభిషేక్ శర్మ, రుతరాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్.
జింబాబ్వే జట్టు : తడివనషె మరుమని, ఇన్నోసెంట్ కియా, బ్రియాన్ బెన్నెట్, సికిందర్ రజా(కెప్టెన్), డియోన్ మేయర్స్, జొనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదండె(వికెట్ కీపర్), వెస్లే మధీవెరె, లుకె జాంగ్వే, బ్లెస్సింగ్ ముజరబని, తెండాయ్ చతర.
జింబాబ్వే పర్యటనను భారత జట్టు (Team India) ఓటమితో మొదలెట్టింది. హారారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన తొలి టీ20లో టీమిండియా చిత్తుగా ఓడింది. 115 పరుగుల ఛేదనలో టాప్ ఆటగాళ్లంతా చేతులెత్తేయగా 102కే ఆలౌటయ్యింది. దాంతో, ఆతిథ్య జట్టు 13 పరుగుల తేడాతో గెలుపొందింది.
The match went down till the very last over but it’s Zimbabwe who win the 1st T20I.#TeamIndia will aim to bounce back in the 2nd T20I tomorrow.
Scorecard ▶️ https://t.co/r08h7yfNHO#ZIMvIND pic.twitter.com/FLlBZjYxCb
— BCCI (@BCCI) July 6, 2024
జింబాబ్వే బౌలర్లు తెండాయ్ చతర (3/16), కెప్టెన్ సికిందర్ రజా (3/25), లు విజృంభించడంతో శుభ్‌మన్ గిల్ సేనకు ఓటమి తప్పలేదు. దాంతో, భారత జట్టుపై టీ20ల్లో అత్యల్ప స్కోర్‌ను కాపాడుకున్న జట్టుగా జింబాబ్వే చరిత్ర సృష్టించింది. ఇంతకముందు ఆ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది. కివీస్ 2016లో టీమిండియాపై 126 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది.