గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Sep 05, 2020 , 19:24:18

సచిన్ ప్రేరేపించే కెప్టెన్ కాదు : శశి థరూర్

సచిన్ ప్రేరేపించే కెప్టెన్ కాదు : శశి థరూర్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశి థరూర్ గొప్ప క్రికెట్ అభిమాని. కెప్టెన్‌గా సచిన్ టెండూల్కర్ నైపుణ్యాలను తాను ఎప్పుడూ ఒప్పుకోలేదని చెప్పారు. టీమిండియాకు కెప్టెన్‌గా టెండూల్కర్ ఉత్తమ ఎంపిక అని తాను భావించానని, అయితే అతడికి ఆ బాధ్యత ఇచ్చిన తర్వాత అతడి అవగాహన మారిందని, అలాగే ఉత్తమ ఫలితాలను ఇవ్వలేదని థరూర్ వ్యాఖ్యానించాడు.

"సచిన్ కెప్టెన్ కావడానికి ముందే భారతదేశానికి అత్యుత్తమ కెప్టెన్ అని నేను అనుకున్నాను. ఎందుకంటే అతను కెప్టెన్ కానప్పుడు అతను చాలా చురుకుగా ఉన్నాడు. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా ఆనాటి కెప్టెన్ వరకు పరిగెత్తి మరీ సలహా ఇచ్చి, ప్రోత్సాహించేవాడు” అని ఒక ఇంటర్వ్యూలో శశి థరూర్ తెలిపారు. అలాగే సచిన్ జట్టుకు స్ఫూర్తిదాయకంగా గానీ, ప్రేరణాత్మకంగా ఉండలేదని, అలాంటప్పుడు కెప్పెన్ గా ఫెయిలయ్యాడని భావించాలన్నారు. కెప్టెన్ గా తన ఆటతీరు పేలవంగా మారుతున్నది తెలుసుకున్న తర్వాత సచినే స్వయంగా కెప్టెన్సీ వదులుకునేందుకు సంతోషంగా ఒప్పుకున్నాడని అన్నారు.

1996 లో టెండూల్కర్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. అతను దేశానికి నాయకత్వం వహించిన 73 వన్డేలలో జట్టు 23 మ్యాచ్‌ల్లో గెలువగా.. 43 మ్యాచుల్లో ఓడిపోయింది. అతడి విజయాల శాతం 35.07. టెస్టుల్లో సచిన్ కెప్టెన్‌గా రికార్డు మరింత ఘోరంగా ఉంది. నాయకత్వం వహించిన 25 మ్యాచ్‌ల్లో తొమ్మిదింటిలో ఓడిపోగా.. నాలుగింటిలోనే గెలిచింది. టెండూల్కర్ ఆధ్వర్యంలో 1999 లో జట్టు ఆస్ట్రేలియా పర్యటన టీమిండియాకు అధ్వాన్నమైన విదేశీ పర్యటనలలో ఒకటి. టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-3తో ఓడిపోగా.. వన్డే ట్రై-సిరీస్‌లో 14 మ్యాచ్‌ల్లో ఒకదాన్ని మాత్రమే గెలుచుకుంది. 


logo