అపోలో-11 మిషన్ ఆస్ట్రోనాట్ మైఖేల్ కన్నుమూత
అపోలో-11 మిషన్ ఆస్ట్రోనాట్ మైఖేల్ కన్నుమూత | చంద్రుడిపైకి వెళ్లిన అపోలో -11 వ్యోమనౌక ఆస్ట్రోనాట్ మైఖేల్ కొలిన్స్ (90) బుధవారం కన్ను మూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

వాషింగ్టన్ : చంద్రుడిపైకి వెళ్లిన అపోలో -11 వ్యోమనౌక ఆస్ట్రోనాట్ మైఖేల్ కొలిన్స్ (90) బుధవారం కన్ను మూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. 1969లో చంద్రుడిపై మానవుడు తొలిసారిగా పాదం మోపిన అపూర్వ ఘట్టంలో కీలకపాత్రధారుల్లో ఆయన ఒకరు. అపోలో మిషన్‌లో ప్రయాణించిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్.. లూనార్ ల్యాండర్ ద్వారా చందమామపై పాదం మోపిన విషయం తెలిసిందే. మిషన్‌లో ఆయన చంద్రుడిపై కాలు మోపకపోయినా.. ఆ సమయంలో మైఖేల్ చందమామ ఉపరితలానికి 69 కిలోమీటర్ల దూరంలో ఉన్న అపోలో-11 కమాండ్ మాడ్యూల్ అయిన కొలంబియాలో ఉన్నారు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఆల్డ్రిన్ తిరిగి కక్ష్యలోకి చేరుకున్న తర్వాత వారి స్పేస్ క్రాప్ట్ను తానున్న స్పేస్ క్రాప్ట్‌తో అనుసంధానించి, క్షేమంగా భూమి మీదకు తీకురావడంలో కీలకపాత్ర పోషించారు.

మైఖేల్ 1930లో ఇటలీలో జన్మించారు. వెస్ట్ పాయింట్‌లోని యునైటెడ్ స్టేట్స్ మిలటరీ అకాడమీ నుంచి పట్టా పొందారు. 1958-1963 వరకు కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ వైమానిక దళ స్థావరంలో పని చేశారు. 1963లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆయన మొదటిసారిగా జూలై 18, 1966 జెమిని-10లో మూడు రోజుల మిషన్‌లో పాల్గొన్నారు. అమెరికా చరిత్రలో స్పేస్ వాక్ చేసిన మూడో వ్యక్తి మైఖేల్. ఆయన తన రెండో మిషన్ అపోలో-11లో చంద్రుడి కక్షలోకి వెళ్లి వచ్చారు. అయితే చంద్రుడిపై పాదం మోపే అవకాశం తనకు రానందుకు ఎన్నడూ తాను బాధపడలేదని, చంద్రగ్రహంపైకి మానవుడి యాత్రను విజయవంతం చేయడంలో తాను నిర్వహించిన పాత్ర తనకు సంపూర్ణమైన సంతృప్తినిచ్చిందని 1974లో ప్రచురితమైన తన ఆత్మకథ ‘క్యారియింగ్ ద ఫైర్’లో మైఖేల్ కొలిన్స్ పేర్కొన్నారు. కొలిన్స్ 1970 నాసాలో పదవీ విరమణ చేసిన అనంతరం నేషనల్ అండ్ స్పేస్ మ్యూజియం డైరెక్టర్, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ అండర్ సెక్రెటరీగా పని చేశారు.
ఇవి కూడా చదవండి..
టీకా కోసం 1.23కోట్ల రిజిస్ట్రేషన్లు
మరో రెండు రోజులు తెలంగాణలో వానలు
వరుస భూకంపాలతో వణుకుతున్న అసోం
నేటినుంచి పాస్‌పోర్ట్ సేవలకు బ్రేక్
కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

