Sachin Tendulkar : భారతదేశమంతా వినాయకుడి భజనలతో మార్మోగిపోతోంది. సెలబ్రిటీలు తమ ఇండ్లలో విఘ్నేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ మురిసిపోతున్నారు. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar ) కూడా వినాయక చతుర్ధి వేడుకలను ఘనంగా చేసుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో మూడు రోజుల పాటు మాస్టర్ బ్లాస్టర్ గణపయ్యను పూజించాడు.
కుటుంబంతో కలిసి లంబోదరుడి ఆశీర్వాదాలు తీసుకున్న సచిన్ సోమవారం నిమజ్జనం చేశాడు. ఒక పెద్ద బకెట్లో నీళ్లు పోసి.. అందులో వినాకుడి ప్రతిమను వేశాడు. తమ ఇంటి విఘ్నేషుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న ఫొటోను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు.
बाप्पा, तुम्ही दिलेल्या आनंदाची, शांतीची आणि प्रेमाची आठवण कायम राहील. पुढच्या वर्षी लवकर या!
गणपती बाप्पा मोरया! मंगलमूर्ती मोरया! 🙏🏼 pic.twitter.com/OGrp6ISKCB
— Sachin Tendulkar (@sachin_rt) September 9, 2024
‘బప్పా.. ఉల్లాసం, శాంతి, ప్రేమ.. నీవు ఇవన్నీ నాకు ఇచ్చావు. నిన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. వచ్చే ఏడాది తొందరగారా. గణపతి బప్పా మోరియా.. మంగళ్మూర్తి మోరియా’ అని ఆ ఫొటోకు సచిన్ భావోద్వేగపూరిత క్యాప్షన్ రాశాడు. అంతేకాదు.. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలతో రికార్డు నెలకొల్పిన సచిన్ ప్రస్తుతం ఐపీఎల్(IPL)లో తళుక్కుమంటున్నాడు. గతంలో కెప్టెన్‌గా నడిపించిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఫ్రాంచైజీకి అతడు మెంటార్‌గా సేవలందిస్తున్నాడు. అదే జట్టు తరఫున అతడి కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) 17వ సీజన్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. దాంతో, ఒకే ఐపీఎల్ జట్టుకు ఆడిన తండ్రీకొడుకులుగా సచిన్, అర్జున్‌లు రికార్డు సృష్టించారు.
సచిన్, అర్జున్ టెండూల్కర్