Sachin Tendulkar : వీడ్కోలు అనంతరం భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ మెంటర్‌గా అభిమానులను అలరిస్తూనే.. అప్పుడప్పుడు సాధారణ పౌరుడిలా సచిన్ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఒకప్పుడు మైదానంలో టన్నుల కొద్దీ పరుగులు సాధించి.. లెక్కలేనన్ని రికార్డులు తన పేరిట రాసుకున్న మాస్టర్ బ్లాస్టర్ తాజాగా ప్రకృతి ఒడిలో సేదతీరాడు.
అక్కడ తనను అమితంగా ఆకర్షించిన ఓ ఫొటోను ఫ్యాన్స్‌తో ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ఇంకేముంది ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకూ సచిన్ పోస్ట్‌లో ఏం ఉందో తెలుసా..? క్రికెట్ స్టంప్స్‌ను తలపించేలా ఉన్న చెట్లు. అవును. ఏ అంపైర్ స్టంప్స్‌ను ఇంత పెద్దవిగా మర్చాడో ఊహించండి? అంటూ సచిన్ పోస్ట్ చేశాడు. అందులో స్టంప్స్ మాదిరిగానే ఉన్న మూడు చెట్ల ముందు ఈ దిగ్గజ ఆటగాడు బ్యాట్ పట్టుకొని నిలుచున్నట్టు పోజిచ్చాడు.
Can you guess which umpire made the stumps feel this big? 🤔 pic.twitter.com/oa1iPvVza1
— Sachin Tendulkar (@sachin_rt) November 16, 2024
సచిన్ అడిగిన ప్రశ్నకు ఓ అభిమాని ‘ఇంకెవరు స్టీవ్ బక్నర్’ అని బదులిచ్చాడు. మరొకరు ‘డారెల్ హైర్’ అని రాయగా.. మరికొంతమంది ‘మిడిల్ స్టంప్‌ను స్టీవ్ బక్నర్, లెగ్ స్టంప్‌ను డారిల్ హార్పెర్లు అంత పెద్దగా అమర్చి ఉంటారు’ అని ఫన్నీగా తమ కామెంట్లు తెలియజేశారు.