BCCI | సచిన్‌కు ప్రత్యేక గౌరవం.. ‘ఎస్ఆర్టీ 100’ పేరుతో బోర్డ్‌రూమ్
BCCI : భారత క్రికెట్ దిగ్గజాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రత్యేకంగా గౌరవిస్తోంది. విశేష సేవలిందించిన ఆటగాళ్లను ప్రత్యేక బోర్డు రూమ్‌లు ఏర్పాటు చేస్తోంది. శనివారం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరిట స్పెషల్ గదిని ప్రారంభించింది.
BCCI : భారత క్రికెట్ దిగ్గజాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రత్యేకంగా గౌరవిస్తోంది. విశేష సేవలిందించిన ఆటగాళ్లను ప్రత్యేక బోర్డు రూమ్‌లు ఏర్పాటు చేస్తోంది. మొన్ననే సునీల్ గవాస్కర్ పేరిట ప్రత్యేక బోర్డ్‌రూమ్(Board Room) ఏర్పాటు చేసిన బీసీసీఐ.. శనివారం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరిట స్పెషల్ గదిని ప్రారంభించింది. ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో మాస్టర్ బ్లాస్టర్ నూరు శతకాలకు గుర్తుగా ‘SRT 100’ పేరుతో బోర్డు రూమ్‌ను ఏర్పాటు చేశారు బీసీసీఐ అధికారులు.
తద్వారా సన్నీ తర్వాత బోర్డ్ రూమ్ కలిగిన రెండో భారత క్రికెటర్‌గా సచిన్ పేరు మార్మోగిపోతోంది. ఈ సందర్భంగా క్రికెట్ లెజెండ్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. ‘నాకు ఈ గౌరవం కల్పించింనందుకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, ఉపాధ్యకుడు రాజీవ్ శుక్లా, సెక్రటరీ సైకియాలకు ధన్యవాదాలు. నా జీవితంలో మొదటిసారి ఇలాంటి ప్రత్యేక గౌరవాన్ని చవిచూస్తున్నాను. ఎందుకంటే.. ముంబైలోనే నా క్రికెట్ కెరియర్ మొదలైంది.
భారత జట్టుకు విశేష సేవలు అందించిన నాపేరిట ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేయడం నా మనసుకెంతో సంతోషాన్నిఇస్తోంది. ఒక ఆటగాడిగా నేను సాధించిన పలు ట్రోఫీల కంటే ఈ రూమ్ నాకు చాలా విలువైనది’ అని సచిన్ తెలిపాడు. తన సొగసైన ఆటతో అంతర్జాతీయ క్రికెట్‌ను శాసించిన సచిన్.. రికార్డుల వీరుడిగా చరిత్రపుటల్లో చోటు సంపాదించాడు. వన్డేలు, టెస్టుల్లో కలిపి 100 సెంచరీతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. రిటైర్మెంట్ తర్వాత సచిన్ తాను గతంలో ఆడిన ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్‌గా సేవలందిస్తున్నాడు.
సునీల్ గవాస్కర్ 10000
టెస్టుల్లో 10 వేల పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్ సునీల్ గవాస్కర్. రిటైరయ్యాక కామెంటేటర్‌గానూ రాణిస్తున్న గవాస్కర్‌కు మే 15 గురువారం బీసీసీఐ ఊహించని కానుక ఇచ్చింది. అతడి పేరుతో బోర్డ్ రూమ్ ఏర్పాటు చేసింది. గదినిండా గవాస్కర్ ఫొటోలు, అతడి కాలంలో టీమిండియా గెలుపొందిన ట్రోఫీలను పొందుపరిచింది బీసీసీఐ. ఈ సందర్బంగా గవాస్కర్ భావోద్వేగానికి లోనయ్యాడు. పేరిట బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక బోర్డ్‌రూమ్ ఏర్పాటు చేశారు.
Honouring a legend! 🙌
India great Sunil Gavaskar inaugurates 𝟭𝟬𝟬𝟬𝟬 𝗚𝗮𝘃𝗮𝘀𝗸𝗮𝗿 – a Board Room named in his honour and his iconic milestone at the BCCI HQ in Mumbai 👏 pic.twitter.com/laZI0cBL57
— BCCI (@BCCI) May 15, 2025
‘సునీల్ గవాస్కర్ 10000’ అనే పేరుతో దీన్ని రోజర్ బిన్ని, రాజీవ్ శుక్లాలు ప్రారంభించారు. 1987లో పాకిస్థాన్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టులో సన్నీ 10 వేల పరుగుల మైలురాయికి చేరుకున్నాడు. ఇప్పటికీ భారత్ తరఫున సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక రన్స్ కొట్టిన మూడో క్రికెటర్ అతడే. సచిన్ టెండూల్కర్(15,921 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్ (13,288 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు.
ఇవి కూడా చదవండి
- Manchu Vishnu | రక్తం పంచుకు పుట్టిన వాళ్లే నా పతనాన్ని కోరుతున్నారు… మంచు విష్ణు సంచలన కామెంట్స్
- Osmania University | బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా ఫీజు స్వీకరణ
- Tirumalagiri : తిరుమలగిరిలో బారులు తీరిన ధాన్యం లారీలు
- TGBIE | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్స్ విడుదల
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

