Manchu Vishnu | గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ గొడవలపై నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఆస్తి గొడవలు అని కొందరు అంటుంటే, లేదు లేదు ఇతర విషయాలలో గొడవలు అని అనేక ప్రచారాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు విష్ణు తాను నటించిన కన్నప్ప సినిమా ప్రమోషన్లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ చిత్రాన్ని 2 వేల థియేటర్లలో విడుదల చేయనున్నారు. అయితే తాజాగా.. ఓ పాడ్ కాస్ట్లో మంచు విష్ణు మాట్లాడుతూ.. ముందుగా ప్రభాస్తో తనకి ఉన్న అనుభందాన్ని తెలియజేశారు. సినిమాలో నటించినందుకుగాను ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలిపారు.
ప్రభాస్ నేను చాలా క్లోజ్. అతను ఎంత పెద్ద స్టార్ అనేది అతడికి తెలియదు. అతని లోకంలో అతనిది. ఎవరి గురించి పట్టించుకోడు. షూటింగ్ కి వచ్చాడా వెళ్లిపోయాడా.. అంతే. ఆసియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరిగా ఉంటూ కూడా అంత హంబుల్ గా ఉండటం అతని గొప్పతనం. ‘నువ్వు ఏ రోజుకీ మారకూడదు ప్రభాస్.. నువ్వు ఇలాగే ఉండాలి’ అని అంటే.. ‘ఏముంది, మనం ఎప్పుడూ ఇంతే కదా’ అన్నాడు. అతను ఎల్లప్పుడూ అలానే ఉంటాడు అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ఇక 15 ఏళ్ల క్రితం ఓసారి నేనూ ప్రభాస్ మాట్లాడుకుంటున్నప్పుడు, నువ్వు ఎందుకు ఎక్కువ కలవవు అని అడిగాడు ప్రభాస్.
ఎక్కువ కలిస్తే నేను నీకు నచ్చను బ్రదర్ అని అన్నాను అని మంచు విష్ణు తెలిపాడు ..మూడు నెలలకో ఆరు నెలలకో ఒకసారి కలుసుకుంటే, మనం ఎప్పటికీ గ్రేట్ ఫ్రెండ్స్ గా ఉంటాం. ఎందుకంటే మనిద్దరం వేర్వేరు బడుల నుంచి వచ్చాం. నేను లేచే టైం.. నీ పడుకునే టైం. రెండూ డిఫరెంట్ కదా . అయినా సరే మనం ఎప్పటికీ మంచి సోదరులమే అని అతనితో చెప్పాను. రక్తం పంచుకొని పుట్టినవాళ్లే ఈరోజు నా పతనాన్ని కోరుకునేటప్పుడు.. నేను, ప్రభాస్ రక్తం పంచుకొని పుట్టకపోయినా నా మంచి కోరి నా సక్సెస్ కోరుతున్నాడు. ఎన్ని జన్మలకైనా అతనికి నేను రుణపడి ఉంటాను. నిజంగా ప్రభాస్ కి నేను కృతజ్ఞుడిగా ఉంటాను అని మంచు విష్ణు అన్నారు. తన తండ్రి సంతోషమే తనకు ముఖ్యమని.. ఆయనకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్వాలేదు కానీ ఆయనకు చెడ్డపేరు తీసుకురాకూడదని మంచు విష్ణు అన్నారు.