తిరుమలగిరి, మే 17 : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఏఎస్ఆర్ రైస్ మిల్లు వద్ద ధాన్యం లోడ్లతో లారీలు బారులు తీరాయి. కాంటాలు త్వరగా చేపట్టడం లేదని రైతులు ధర్నాలు, నిరసనలు చేపట్టిన నేపథ్యంలో అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలు చేస్తుండడంతో ధాన్యం ఎగుమతి చేసుకున్న లారీలు రైస్ మిల్లు వద్దకు చేరాయి. దీంతో రైస్ మిల్లు వద్ద భారీగా లారీలు బారులు తీరాయి. మిల్లర్లు ధాన్యం లారీలను వెంటనే దిగుమతి చేసుకోవాలని అధికారులు సూచించారు.