TGBIE | హైదరాబాద్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల అయ్యాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు తమ కాలేజీల్లో హాల్ టికెట్స్ను తీసుకోవచ్చు. లేదంటే ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. హాల్ టికెట్స్ కోసం www.tgbie.cgg.gov.in ను సంప్రదించొచ్చు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22 నుంచి 28 వరకు రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం పరీక్షలు , ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరగనున్నాయి.