Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) (ఐడీ, హెచ్ఐ, ఎల్డీ, ఏఎస్డీ) కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈ నెల 27వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని పేర్కొన్నారు. రూ.200 అపరాధ రుసుముతో 30వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.