French Open : మట్టి కోర్టుపై జరుగుతున్న టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్(French Open)లో టాప్ సీడ్లు కుమ్మేస్తున్నారు. అంచనాలను అందుకుంటూ ప్రత్యర్థులకు చెక్ పెడుతున్నారు. మహిళల విభాగంలో రెండో సీడ్ అరినా సబలెంక(Aryna Sabalenka), పురుషుల టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదేవ్(Danil Medvedev)లు అలవోకగా మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు.
గురువారం జరిగిన మ్యాచ్‌లో క్వాలిఫయర్ మొయుకా ఉచిజిమీపై బెలారస్ భామ సబలెంక సునాయసంగా విజయం సాధించింది. ఆట ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆమె జపాన్‌కు చెందిన మొయుకాపై పైచేయి సాధించింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్ రెండో రౌండ్‌కు చేరిన ఆమెను వరుస సెట్లలో వణికించింది. చివరకు 6-2, 6-2తో సబలెంక జయభేరి మోగించింది.
Solid stuff from Sabalenka 👊
Will play Badosa or Putinseva in the next round 👀#RolandGarros pic.twitter.com/Rq1QA4s7C3
— Roland-Garros (@rolandgarros) May 30, 2024
టైటిల్ ఫేవరేట్లలో ఒకడైన ఐదో సీడ్ మెద్వెదేవ్ సైతం ముందంజ వేశాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో సెర్బియా కు చెందిన మియోమిర్ కెమనోవిక్ని చిత్తు చేశాడు. 57వ ర్యాంకర్ అయిన మియోమిర్ 6-1తో తొలి సెట్ కోల్పోయాడు. రెండో సెట్లో సైతం పోటీ ఇవ్వలేకపోయిన అతడు 5-0 వద్ద ఇబ్బంది పడ్డాడు.
Medvedev is through to R3 after Miomir Kecmanovic had to retire 🙏#RolandGarros pic.twitter.com/rjnx49Nzji
— Roland-Garros (@rolandgarros) May 30, 2024
దాంతో, కోర్టులోనే అతడికి వైద్య చికిత్స అందించారు. అయినా సరే మియోమిర్ మధ్యలోనే వైదొలిగాడు. రొలాండ్ గరోస్లో ఇప్పటివరకూ క్వార్టర్స్ చేరని మెద్వెదేవ్‌కు తర్వాతి రౌండ్లో గట్టి పోటీ ఎదురవ్వనుంది. మరియానో నవొనె, థామస్ మచాక్ మ్యచ్ విజేతతో అతడు మూడో రౌండ్లో తలపడనున్నాడు.