AP ICET Results | ఆంధ్రప్రదేశ్‌లో ఐసెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 44,447 మంది విద్యార్థులు ఐసెట్‌కు హాజరయ్యారు. ఇందులో 42,984 మంది అర్హత సాధించగా.. 96.71శాతం శాతం నమోదైందని ఆయన తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎ క్రాంతికుమార్ 176.81 మార్కులతో మొదటి ర్యాంకును సాధించాడు. రెండో ర్యాంగ్ గున్నం సాయి కార్తిక్, మూడో ర్యాంకు సూరిశెట్టి వసంతలక్ష్మి (విశాఖపట్నం), నాలుగో ర్యాంక్ కడపన గణేశ్ కుమార్ రెడ్డి (అనంతపురం), ఐదో ర్యాంకును సామిరెడ్డి తరుణ్ కుమార్ (విజయనగరం), ఆరో ర్యాంకును తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎస్. దశరథరామరెడ్డి సాధించాడు.
ఏడో ర్యాంకులో కొర్లం శ్రీకుమార్ (శ్రీకాకుళం), ఎనిమిదితో ర్యాంకులో పుచ్చా అనుపమ (తూర్పుగోదావరి), తొమ్మిదో ర్యాంకులో దవనబోయన వెంకటేశ్ (అనంతపురం), చిత్తూరు జిల్లాకు చెందిన దొరై మునిశేషాద్రి గిరీశ్ సాయి పదో ర్యాంకును సాధించాడు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్-2024ని ఈ నెలలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెల 6న ఏపీలో 111, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. 48,828 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 44,446 మంది పరీక్షలకు హాజరయ్యారు.