జయ జయహే తెలంగాణ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కంపోజ్ చేయించడం పట్ల జగిత్యాలకు చెందిన సంగీత దర్శకుడు ఎస్వీ మల్లిక్ తేజ ఆవేదన వ్యక్తం చేశారు. జయ జయహే పాటకు అర్జెంట్‌గా సంగీతం అందించాలని ఏడాదిన్నర క్రితం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కోరారని ఆయన తెలిపారు. అప్పుడు అదే రోజు పొద్దున చెబితే.. అన్ని పనులను పక్కనబెట్టుకుని పాటకు సంగీతం అందించానని చెప్పారు. అప్పుడు ఉన్న తక్కువ సమయంలో పరిమితమైన బడ్జెట్లో పాట రూపకల్పన చేసి ఇచ్చానని తెలిపారు.
తాను కంపోజ్ చేసి పాట విన్న తర్వాత అద్భుతంగా పాట చేశానని అందెశ్రీ ప్రశంసించారని మల్లిక్ తేజ తెలిపారు. మహిళల బృందగానంతో బాగుందని మెచ్చుకున్నారని తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో రూపొందించే అవకాశాన్ని తనకే కల్పిస్తామని మాట ఇచ్చారని పేర్కొన్నారు. అయితే తనకు కాకపోయినా.. వేరే తెలంగాణ వాళ్లకు కాకుండా కీరవాణితో పాడించడం బాధగా ఉందన్నారు. కీరవాణి అంటే అందరికి అభిమానం ఉంటుంది.. కానీ ఆయన్ను తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణలో లేడని అనడం బాధగా అనిపించిందని అన్నారు. అప్పుడు ఏడాదిన్నర కిందట కూడా కీరవాణితో పాడించుకుంటే అయిపోయేది కదా అని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ లేదన్నప్పుడు చిన్న కళాకారులతో పాడించారని.. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి, సమయం ఉండి.. సరిపడా బడ్జెట్ ఉన్న సమయంలో కూడా చిన్న కళాకారులకు అవకాశం ఇచ్చి ఉంటే గుండెల్లో పెట్టుకునే వారని అన్నారు. వాళ్లు ఆస్కార్ గ్రహీతలు అని.. మీరిచ్చే అవకాశం వాళ్లకు ఆస్కార్ కిందనే ఉంటది తప్ప ఆస్కార్‌పైన ఉండదని తెలిపారు. మాలాంటి చిన్న కళాకారులకు అవకాశమిస్తే మరింత ప్రేమతో పనిచేసేవాళ్లం కదా అని చెప్పుకొచ్చారు.
తెలంగాణ బిడ్డకు అవకాశం ఇస్తానని రేవంత్ రెడ్డి, అందెశ్రీ మోసం చేశారు
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కోరడంతో జయ జయహే తెలంగాణ పాటకి సరిగ్గా సంవత్సరం క్రితమే నేను సంగీతం సమకూర్చాను.
అప్పుడున్న తక్కువ సమయంలో పరిమితమైన బడ్జెట్ లో పాట రూపకల్పన చేసి… pic.twitter.com/p1LYuEp0Zj
— Telugu Scribe (@TeluguScribe) May 30, 2024