Banjarahills | కానిస్టేబుల్‌తో దురుసు ప్రవర్తన.. వ్యక్తిపై కేసు నమోదు
Banjarahills | బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్పట్ల (Constable) దురుసుగా(Misbehaviour) ప్రవర్తించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బంజారాహిల్స్,మే 30 : బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్పట్ల (Constable) దురుసుగా(Misbehaviour) ప్రవర్తించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని కమాండ్ కంట్రోల్ వద్ద ఈనెల 28న మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు బైక్‌లమీద వచ్చి తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. సరిగ్గా గేటు ముందు బైక్‌లు అపి వాళ్లు వాదన చేస్తుండడంతో అక్కడే డ్యూటీ చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ శ్రద్ధాంత్ మోహన్ అక్కడకు వచ్చాడు.
గేటు ముందునుంచి ముందుకు వెళ్లాలని, గొడవ ఆపాలని చెప్పాడు.
దీంతో ఇద్దరు వ్యక్తులు ముందుకు వెళ్లిపోయారు. అయితే బైక్‌మీద వచ్చిన హబీబ్ హసన్ అనే వ్యక్తి మాత్రం అక్కడ నుంచి వెళ్లకపోగా తీవ్రస్వరంతో గొడవకు దిగాడు. అతడి యాక్టివా బైక్ మీద పోలీస్ స్టిక్కర్ ఉండడంతో పాటు మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించడంతో పెట్రోలింగ్ పోలీసులను పిలిపించి అప్ప గించాడు. తనను పోలీసులకు అప్పగించినందుకు అంతుచూస్తానంటూ హెచ్చరించడంతో ఈ మేరకు కానిస్టేబుల్ మోహన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఐపీసీ 353,186,506తో పాటు 192 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

