SA20 : ఐపీఎల్ తర్వాత క్రికెటర్లపై కోట్లు కుమ్మరించే దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నాలుగో సీజన్ వేలానికి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 9న మెగా వేలానికి సన్నాహకాలు చేస్తున్నారు నిర్వాహకులు. ఆక్షన్‌కు సమయం దగ్గర పడడంతో ఫ్రాంచైజీల కీలక అప్డేట్ ఇచ్చారు. ఈసారి ఒక్కో జట్టు ఆరుగురుని మాత్రమే అట్టిపెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ టోర్నీ చరిత్రలో ఇంత తక్కువ మందిని రిటైన్ చేసుకోవాలని సూచించడం ఇదే మొదటిసారి.
ప్రతి జట్టు ఆరుగురిని మాత్రమే కొనసాగించనున్న నేపథ్యంలోఈ సారి 72 స్లాట్స్ కోసం వేలం జరుగనుంది. అంతేకాదు రైట్ టు మ్యాచ్ విధానాన్ని కూడా వినియోగించుకోవచ్చు. మూడో సీజన్లో తమకు ఆడిన క్రికెటర్ కోసం ఈ ఫార్ములాను వాడుకునే వీలుంది. అయితే.. వేలంలో సఫారీ ప్రతి ఫ్రాంచైజీలో 11 మంది సఫారీ ఆటగాళ్లు, ఏడుగురు విదేశీ క్రికెటర్లు.. ఉండేలా చూసుకోవాలని ఎస్ఏ20 నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు వీళ్లలో అండర్ -23 ఆటగాళ్లు కనీసం ఇద్దరు ఉండాలనే నియయం విధించారు.
#SA20 teams will be permitted to retain just six players from their 18-member squads ahead of the fourth season, with 72 spots up for grabs in the auction that will take place on September 9
Details: https://t.co/PWmUpd6GgY pic.twitter.com/azScU30JCq
— ESPNcricinfo (@ESPNcricinfo) June 24, 2025
ఐపీఎల్లో ఆడుతున్న ఆరుజట్లకు ఎస్ఏ20లో సిస్టర్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. డర్బన్ సూపర్ జెయింట్స్ జొబర్గ్ సూపర్‌కింగ్స్ ఎంఐ కేప్‌టౌన్ పార్ల్ రాయల్స్ ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలి రెండు సీజన్లలో ఈస్టర్న్ కేప్ విజేతగా నిలిచింది. మూడో సీజన్లో మాత్రం ఎంఐ కేప్‌టౌన్ ఛాంపియన్‌గా అవతరించింది.