నిడమనూరు, జూన్ 24 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాలను విధిగా పాటించాలని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండల పరిధిలోని మార్లగడ్డలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు సొంత గూడు కల్పించాలన్న ఉద్ధేశ్యంతోనే ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా శ్రీనివాస్‌రెడ్డి, ముంగి శివమారయ్య, పంచాయతీ కార్యదర్శి బెజవాడ సతీశ్, ఉమ్మడి వల్లభరెడ్డి, ఉమ్మడి ఆనంద్‌రెడ్డి, సభావత్ శ్రీను, ధరావత్ భాస్కర్ నాయక్, ఇంజం ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.