Roston Chase : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సీజన్‌కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. జూన్‌లో మొదలుకాబోయే నూతన ఎడిషన్‌కు కొత్త సారథులను ప్రకటిస్తున్నాయి. తాజాగా వెస్టిండీస్ సెలెక్టర్లు రోస్టన్ ఛేజ్ (Roston Chase)ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. మార్చిలో క్రెగ్ బ్రాత్‌వైట్ (Craigg Brathwaite) రాజీనామా చేయడంతో ఆల్‌రౌండర్ అయిన రోస్టన్కు శనివారం పగ్గాలు అప్పగించింది విండీస్ బోర్డు. 33 ఏళ్ల రోస్టన్ రెండేళ్లుగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆస్ట్రేలియా సిరీస్‌తో రోస్టన్కు తొలి సవాల్ ఎదరుకానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో ఆసీస్‌కు కూడా ఇదే మొదటి సిరీస్.
బ్రాత్‌వైట్ మార్చిలో టెస్టు సారథిగా తప్పుకున్నాడు. దాంతో, కొత్త కెప్టెన్ కోసం పలువురి పేర్లను పరిశీలించారు. జాన్ క్యాంప్‌బెల్, జొషువా డిసిల్వా, జస్టిన్ గ్రీవ్స్.. ఇలా పేర్లను పరిశీలించారు. ప్రస్తుతం వన్డే, టీ20లకు కెప్టెన్‌గా కొనసాగుతున్న షై హోప్(Shai Hope)ను కూడా సంప్రదించారట. కానీ, అతడు రెండు ఫార్మాట్లపై దృష్టి సారించేందుకే మొగ్గు చూపడంతో చివరకు రోస్టన్కు బాధ్యతలు అప్పగించారు. స్పిన్నర్, టెయిలెండర్ బ్యాటర్ అయిన జొమెల్ వారికన్ అతడికి డిప్యూటీగా ఎంపికయ్యాడు.
Roston Chase has been appointed the new West Indies Test captain.
The appointment was unanimously approved by the CWI Board of Directors during its meeting held today, May 16, 2025.
Congratulations Roston – WI are rallying behind you!🌴🏏 pic.twitter.com/xfCRfc7A34
— Windies Cricket (@windiescricket) May 16, 2025
‘టెస్టు జట్టుకు కెప్టెన్ ఎంపిక చాలా క్లిష్టంగా జరిగింది. విండీస్ జట్టు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని రోస్టన్ను ఎంపిక చేశాం. మా టీమ్ మొత్తం ఎంతో నిష్పక్షపాతంగా ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్ క్రికెట్ గొప్ప నాయకులలో ఒకరిగా రోస్టన్ నిలిచిపోతాడని నమ్ముతున్నాం’ అని వెస్టిండీస్ క్రికెట్ అధ్యక్షుడు కిశోర్ షాల్లో వెల్లడించాడు. ఇక హెడ్‌కోచ్ డారెన్ సమీ(Darren Sammy) నూతన సారథి రోస్టన్కు సంపూర్ణ మద్దతు ఇస్తానని తెలిపాడు.
From Christ Church, Barbados 🇧🇧, emerges a leader defined not by noise—but by nobility.
Now, the gentle giant steps forward as the new captain of the West Indies Test team—a man forged in pressure, yet always cooled by calm conviction.
Congrats Roston Chase! 👏🏽👏🏽 pic.twitter.com/8O567AfLGz
— Windies Cricket (@windiescricket) May 16, 2025
ఆరడుగుల పొడవుతో బక్కపలచగా ఉండే రోస్టన్ది బార్బడోస్‌లోని క్రిస్ట్ చర్చ్. దేశవాళీలో అదరగొట్టి సెలెక్టర్ల దృష్టిలో పడిన అతడు 2016లో జూలై21న భారత్‌పై అరంగేట్రం చేశాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తూ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఇప్పటివరకూ రోస్టన్ 49 టెస్టులు ఆడాడు. 26.33 సగటుతో 2,265 పరుగులు సాధించాడు. అందులో 5 సెంచరీలు ఉన్నాయి. ఆల్‌రౌండర్ అయిన అతడు 85 వికెట్లు పడగొట్టాడు. 2019లో ఇంగ్లండ్‌పై 60 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో రోస్టన్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.