మునుగోడు, మే 17 : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపెల్లి వాసి వెదిరే మధుసూదన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలిసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి శనివారం మండలంలోని కొంపల్లి గ్రామానికి విచ్చేసి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నివాళి అర్పించిన వారిలో నాయకులు మారగోని అంజయ్య గౌడ్, అనంతరెడ్డి, మేకల శ్రీనివాస్ రెడ్డి, డోకూరు వేణుగోపాల్ రెడ్డి, బోయపర్తి సురేందర్, జిట్టగోని మల్లేశ్‌యాదవ్ ఉన్నారు.