Mission Bhagiratha | పెద్దేముల్, మే 17 : పెద్దేముల్ మండల పరిధిలో జనగాం గ్రామంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ నీరు రోడ్డుపై వృథాగా పారుతుంది. సంబంధిత అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. గ్రామంలో మిషన్ భగీరథ నీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు అదే స్థలంలో మిషన్ భగీరథ పైపులైన్ దెబ్బతినడం అధికారులు అరకొర మరమ్మత్తులు చేయడం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పైపులైన్ మరమ్మత్తులు నిర్వహించి జనగం గ్రామ ప్రజలకు నీరు అందేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.