హైదరాబాద్: పాకిస్థాన్ ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని, ఆ దేశం మానవాళికి ప్రమాదకరంగా మారినట్లు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) అన్నారు. ఇటీవల జరిగిన పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో.. పాకిస్థాన్ చర్యల గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ బృందాన్ని పంపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యలో ఈ అంశాన్ని పేర్కొన్నారు.
PTI EXCLUSIVE | Here’s what AIMIM chief Asaduddin Owaisi (@asadowaisi) told PTI CEO & Editor-in-Chief Vijay Joshi when asked about Centre sending seven all-party delegations to take India’s message against terrorism to key partner nations.
“India has been a victim of… pic.twitter.com/ysSqnQZ8lR
— Press Trust of India (@PTI_News) May 17, 2025
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎలా అమాయకుల్ని చంపుతున్నారన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. పాక్ ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశంగా నిలిచిందని, ఇప్పటి వరకు తమాషా చూశామని, జియా ఉల్ హక్ కాలం నుంచి ప్రజల్ని చంపేశారన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే దౌత్యపరమైన అంశాలను తనకు ఇంకా వెల్లడించలేదన్నారు.
ఇస్లామిక్ దేశమని చెప్పుకుంటున్న పాకిస్థాన్ తన చర్యల్ని మానుకోవాలన్నారు. భారత్లో సుమారు 20 కోట్ల మంది ముస్లింలు జీవిస్తున్నారని, ఈ విషయాన్ని కూడా ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్నారు. ఇండియాను దెబ్బతీసి, మతఘర్షణలు రాజేసి, దేశ ఆర్థిక వృద్ధిని అడ్డుకోవాలని పాకిస్థాన్ భావిస్తున్నట్లు ఓవైసీ తెలిపారు. వాళ్లు తమాషా చేస్తున్నారని, వాళ్లు ఇలాంటి పనులు ఆపబోరని, కానీ పెహల్గామ్ దాడితో భారత్ తన సహనం కోల్పోయిందని ఓవైసీ అన్నారు.
ఉగ్రవాదులకు ఆయుధాలు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, ఫైనాన్సింగ్ ద్వారా పాకిస్థాన్ మానవాళికి ప్రమాదంగా మారినట్లు ఓవైసీ తెలిపారు.