ENG vs WI : ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ (England) పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగొందలు కొట్టి వెస్టిండీస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆదివారం జో రూట్(122) రికార్డు సెంచరీతో చెలరేగగా.. కుర్రాడు హ్యారీ బ్రూక్(109) మెరుపు శతకం బాది జట్టును ఆదుకున్నాడు.
అయితే.. లంచ్ తర్వాత కరీబియన్ బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ 425 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ 4 వికెట్లతో రాణించగా.. అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టులో ఓడిన క్రెగ్ బ్రాత్‌వైట్ బృందం సిరీస్ సమం చేయాలంటే 385 పరుగులు చేయాలి.
తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ బాదిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లోనే దంచేసింది. ఓపెనర్ బెన్ డకెట్(76), ఓలీ పోప్(51)లు అర్ధ శతకాలతో చెలరేగారు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్(109) జతగా జో రూట్(122) కీలక భాగస్వామ్యం నిర్మించాడు. వెస్టిండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ వీళ్లిద్దరూ నాలుగో వికెట్‌కు 189 పరుగులు జోడించారు. దాంతో, ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచింది.
Root equals Williamson and Smith 👏 #ENGvWI pic.twitter.com/kqg7TLcmOZ
— ESPNcricinfo (@ESPNcricinfo) July 21, 2024
బ్రూక్ తర్వాత రూట్ కెరీర్లో 32వ సెంచరీతో చరిత్ర సృష్టించాడు.ఈ ఫీట్‌తో అతడు న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్, ఆసీస్ లెజెండ్ స్టీవ్ స్మిత్‌ల సరసన చేరాడు. అయితే.. ఆ కాసేపటికేహోల్డర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కొంతసేపటికే ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 400 బాది రికార్డు నెలకొల్పింది.