గంగపుత్రులు, సొంత ఊరు. గల్ఫ్ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశసంలందుకున్న దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘కాక్రోచ్’. అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రధారులు. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం దర్శకుడు పి.సునీల్‌కుమార్ రెడ్డి, నిర్మాత బి.బాపిరాజు విలేకరులతో ముచ్చటించారు. మన సినిమాల్లో సమాజంలోని పువ్వుల్లాంటి జీవితాలనే చూపించారని, కానీ ఆ పువ్వు చుట్టూ ఉండే ముల్లులాంటి జీవితాలను ఎవరూ తెరకెక్కించలేదని, ఈ సినిమా ద్వారా తాను అలాంటి ప్రయత్నం చేశానని పి.సునీల్ కుమార్ రెడ్డి అన్నారు.
కొందరు నేరుస్థులు, వేశ్య మధ్య జరిగిన కథతో బోల్డ్ అండ్ హార్డ్హిట్టింగ్గా ఈ సినిమా తీశానని ఆయన తెలిపారు. సొసైటీ తాలూకు చీకటి కోణాన్ని ఆవిష్కరించే ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ తెలియని ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని పేర్కొన్నారు. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలకు వాస్తవ రూపంగా ఈ సినిమా తీశామని రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో ఆకట్టుకుంటుందని నిర్మాత బి.బాపిరాజు చెప్పారు.