RC16 Movie | పెద్ది పాత్ర కోసం పూర్తిగా మారిపోతున్న చరణ్
పాత్రను బట్టి ఆ పాత్ర కోసం బాడీలాంగ్వేజ్‌ను, గెటప్‌ను, శరీరాకృతిని మార్చుతుంటారు మన కథానాయకులు. రంగస్థలంలో బుచ్చిబాబు పాత్ర కోసం గడ్డం పెంచిన కథానాయకుడు రామ్‌చరణ్ ఇప్పుడు తాజా చిత్రం పెద్ది కోసం కోర మీసాలు పెంచి.. సరికొత్తగా కనిపించబోతున్నారు రామ్‌చరణ్
పాత్రను బట్టి ఆ పాత్ర కోసం బాడీలాంగ్వేజ్‌ను, గెటప్‌ను, శరీరాకృతిని మార్చుతుంటారు మన కథానాయకులు. రంగస్థలంలో బుచ్చిబాబు పాత్ర కోసం గడ్డం పెంచిన కథానాయకుడు రామ్‌చరణ్ ఇప్పుడు తాజా చిత్రం పెద్ది కోసం కోర మీసాలు పెంచి.. సరికొత్తగా కనిపించబోతున్నారు రామ్‌చరణ్. రామ్‌చరణ్-బుచ్చిబాబు కలయికలో రూపొందనున్నతాజా చిత్రానికి పెద్ది అనే టైటిల్‌ను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభైమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను సెప్టెంబరులో ప్రారంభిస్తారని తెలిసింది.
అయితే ప్రస్తుతం పెద్ది చిత్రంలో రామ్‌చరణ్ కనిపించబోతున్న న్యూ అవతార్పైనే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ సిక్స్‌ప్యాక్‌తో పాటు పెద్ద మీసాలు, కొరమీసాలతో కనిపించనున్నాడట. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌చేంజర్ షూటింగ్లో పాల్గొంటున్నారు చరణ్. ఈ చిత్రీకరణ పూర్తవగానే పెద్ది చిత్రం గెటప్‌లోకి రావడానికి ఆయన రెండు నెలలు సమయం తీసుకోబోతున్నాడు. ఇందుకోసం ప్రత్యేక కోచ్‌ను కూడా చరణ్ తీసుకున్నాడట.అయితే పూర్తిగా గేమ్‌చేంజర్ షూటింగ్ పూర్తయిందని శంకర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బుచ్చిబాబు సినిమ కోసం సిద్ధం కావాలనే ఆలోచనలో వున్నాడట ఈ కొణిదెల వారసుడు.
ఉప్పెన తరువాత దాదాపు నాలుగు సంవత్సరాల గ్యాప్ తరువాత బుచ్చిబాబు దర్శకత్వలో రానున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రంలో చరణ్ పాత్ర ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా డిఫరెంట్‌గా డిజైన్ చేశాడట బుచ్చిబాబు. స్వర్గీయ కథానాయిక శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రం క్రీడా నేపథ్యంలో కొనసాగే పీరియాడికల్ డ్రామా అని సమాచారం. ఆస్కార్ విజేతే ఏఆర్ రెహమాన్ సంగీత స్వరాలు అందిస్తున్న ఈ చిత్రానికి ప్రఖ్యాత కెమెరామెన్ రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో వృద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్లతో కలిసి కిలారు సతీష్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
Read Also :
Vishwambhara Movie | చిరు ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి టీజర్ అప్డేట్
Mr Bachchan Movie | అఫీషియల్ : ఇండిపెండెన్స్ బరిలో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’
Janhvi Kapoor | ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన జాన్వీకపూర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

