Mr Bachchan Movie | అఫీషియల్ : ఇండిపెండెన్స్ బరిలో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’
Mr Bachchan Movie | మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’(Mr Bachchan). ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
Mr Bachchan Movie | మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’(Mr Bachchan). ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టైటిల్ పోస్టర్‌తో పాటు షో రీల్ విడుదల చేయగా.. రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్‌లో కనిపిస్తూ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇదిలావుంటే ఈ మూవీ విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఏక్స్ వేదికగా ప్రకటించింది. అయితే ఇప్పటికే ఈ డేట్లో రామ్ పోతినేని – పూరి కాంబోలో వస్తున్న డబల్ ఇస్మార్ట్‌తో పాటు తమిళం నుంచి విక్రమ్ – పా. రంజిత్ కాంబోలో వస్తున్న తంగలాన్ విడుదల కానుంది. దీంతో మిస్టర్ బచ్చన్ కూడా ఆగష్టు 15న వస్తుండటంతో బిగ్ క్లాష్ అవ్వనుంది. మిరపకాయ్ సినిమా తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
#MrBachchan GRAND RELEASE WORLDWIDE ON AUGUST 15th
Special premieres all over on August 14th #MassReunion pic.twitter.com/aLr0kHiID0
— Vamsi Kaka (@vamsikaka) July 21, 2024
Also Read..
- Tirumala | తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.25 కోట్లు
- Pilgrims Dead | కేదార్‌నాథ్‌లో విరిగిపడిన కొండచరియలు.. ముగ్గురు యాత్రికులు మృతి, 8 మందికి గాయాలు
- Viral news | జింకను చుట్టిపడేసిన కొండచిలువ.. ఆఖరి క్షణంలో ఏం జరిగిందంటే..Video
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

