డెహ్రాడూన్: కేదార్‌నాథ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో ముగ్గురు యాత్రికులు మరణించారు. (Pilgrims Dead) మరో 8 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం రుద్రప్రయాగ్ జిల్లాలోని గౌరీకుండ్-కేదార్నాథ్ ట్రెక్కింగ్ మార్గంలో చిర్బాసా ప్రాంతానికి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కేదార్నాథ్ ఆలయానికి వెళ్తున్న భక్తుల్లో ముగ్గురు మరణించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 31 ఏళ్ల కిషోర్ అరుణ్ పరాటే, మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన 24 ఏళ్ల సునీల్ మహదేవ్ కాలే, రుద్రప్రయాగ్‌కు చెందిన అనురాగ్ బిష్త్‌గా మృతులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, ఈ సంఘటనలో మరో 8 మంది యాత్రికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ‘కేదార్నాథ్ యాత్ర మార్గంలో చిర్బాసా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద భక్తులు చిక్కుకున్నారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి’ అని రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. యాత్రికులు సురక్షిత ప్రాంతంలో ఉండాలని సూచించారు.
మరోవైపు కొండచరియలు విరిగిపడి ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
केदारनाथ यात्रा मार्ग के चीरबासा पर अचानक मलबा आने से दबे यात्री ॥
SDRF, DDRF और YMD रेस्क्यू का कार्य कर रहे है।
घायल और जनहानि की संभावना को कम से कम रखने के प्रयास ॥
जिला प्रशासन लगातार यात्रियों से सुरक्षित जगह रुकने का अनुरोध करता है।#mansoon #chardhamyatra2024 pic.twitter.com/51kK0W6mSK— DM Rudraprayag (@DmRudraprayag) July 21, 2024
केदारनाथ यात्रा मार्ग के पास पहाड़ी से मलबा व भारी पत्थर गिरने से कुछ यात्रियों के हताहत होने का समाचार अत्यंत दुःखद है। घटनास्थल पर राहत एवं बचाव कार्य जारी है, इस सम्बन्ध में निरंतर अधिकारियों के संपर्क में हूं। हादसे में घायल हुए लोगों को त्वरित रूप से बेहतर उपचार उपलब्ध…
— Pushkar Singh Dhami (@pushkardhami) July 21, 2024