గుడిపల్లి, జనవరి 06 : బొలెరో వాహనం ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ దుర్ఘటన గుడిపల్లి మండలం చిలకమర్రి గ్రామ పంచాయతీ పరిధిలోని నీలంనగర్ సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద అడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన మారుపాకుల గణేష్ (28) ఈ ఉదయం అంగడిపేట ఎక్స్ రోడ్డు నుండి మల్లేపల్లికి వెళ్తుండగా మిర్యాలగూడ- జడ్చర్ల జాతీయ రహదారిపై బోలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుడిపల్లి ఎస్ఐ నరసింహులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.